https://oktelugu.com/

Shilpa Shetty in Fundraising Event: బయటకొచ్చిన ‘శిల్పాశెట్టి’.. కానీ ఇంకా మౌనమే !

అశ్లీల చిత్రాల సృష్టికర్త ‘శిల్పాశెట్టి’ భర్త ‘రాజ్ కుంద్రా’ గత నెలలో అరెస్ట్ అయ్యాక, ఇక అప్పటి నుండి శిల్పాశెట్టి మీడియాకు మొహం చాటేసింది. దానికి తోడు బయటకు అడుగు పెట్టడానికి కూడా ఆమె బాగా ఇబ్బంది పడింది.చివరకు తనకు లాభాలు తెచ్చే టీవీ షోలకు కూడా డుమ్మా కొట్టింది శిల్పాశెట్టి. అంతగా ఆమె ఈ అశ్లీల చిత్రాల కేసుతో నలిగిపోయింది. అయితే, కాలం ఎలాంటి గాయాన్ని అయినా, ఎలాంటి అవమానాన్ని అయినా మాన్పిస్తోంది అని పాత […]

Written By:
  • admin
  • , Updated On : August 16, 2021 / 07:06 PM IST
    Follow us on


    అశ్లీల చిత్రాల సృష్టికర్త ‘శిల్పాశెట్టి’ భర్త ‘రాజ్ కుంద్రా’ గత నెలలో అరెస్ట్ అయ్యాక, ఇక అప్పటి నుండి శిల్పాశెట్టి మీడియాకు మొహం చాటేసింది. దానికి తోడు బయటకు అడుగు పెట్టడానికి కూడా ఆమె బాగా ఇబ్బంది పడింది.చివరకు తనకు లాభాలు తెచ్చే టీవీ షోలకు కూడా డుమ్మా కొట్టింది శిల్పాశెట్టి. అంతగా ఆమె ఈ అశ్లీల చిత్రాల కేసుతో నలిగిపోయింది.

    అయితే, కాలం ఎలాంటి గాయాన్ని అయినా, ఎలాంటి అవమానాన్ని అయినా మాన్పిస్తోంది అని పాత సినిమా డైలాగ్ ఒకటి ఉంది కదా. ఇప్పుడు అదే డైలాగ్ శిల్పా శెట్టికి కూడా బాగా వర్తించింది. మొత్తమ్మీద నెల రోజుల తర్వాత నిన్న బయట ప్రపంచానికి కనిపించింది శిల్పా.ఆగస్ట్ 15 సందర్భంగా జరిగిన ఓ ఈవెంట్ లో ఈ యోగా సుందరి పాల్గొంది.

    అయితే, ఇంతకీ ఈ ఈవెంట్ ఏమిటో తెలుసా ? కరోనా ఫండ్ రైజర్ కోసం నిర్వహించిన ఈవెంట్.మరి ఇలాంటి ఈవెంట్ లో పాల్గొని మళ్ళీ పాజిటివ్ వార్తల కోసం శిల్పా శెట్టి బాగా తాపత్రయం పడుతున్నట్లు అనిపిస్తుంది. ఇక ఆమెను చూడగానే మీడియా ఆమెపై ఎగబడింది. ప్రశ్నలతో గ్యాప్ లేకుండా ఆమె పై విరుచుకు పడింది.

    కానీ, మీడియా ఎంత హడావిడి చేసినా శిల్పా శెట్టి మాత్రం అసలు మాట్లాడలేదు.పైగా ఈవెంట్ కి వచ్చినప్పుడు తనకు సెక్యూరిటీగా నలుగురు బాడీ గార్డ్స్ ను తెచ్చుకుంది. ఎవరు ఆమెను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చాలా జాగ్రత్తగా మీడియాకి దూరంగా ఉంటూ.. ఈవెంట్ ముగిసాక నేరుగా ఇంటికి వెళ్ళిపోయింది.

    అయినా, తన భర్త కొన్ని మొబైల్ యాప్స్ ద్వారా అశ్లీల చిత్రాలను తెరకెక్కించి, యాప్స్ లో అప్ లోడ్ చేశారని, బలమైన ఆరోపణలు వస్తున్నప్పుడు.. వాటిల్లో నిజం లేకపోతే ఆమె ఎందుకు వివరణ ఇవ్వడం లేదు ? అంటే.. ఇన్ డైరెక్ట్ గా తన భర్త అశ్లీల చిత్రాల రారాజు అని, అశ్లీలంలో ఆయనకు వచ్చిన పేరుప్రఖ్యాతలు నిజమే అని శిల్పా శెట్టి ఒప్పుకున్నట్లే కదా.