AP 3 Capitals: ఊరించాడు.. ఉత్సాహం రేకెత్తించాడు.. అమరావతి రైతులు, ప్రతిపక్ష టీడీపీలో ఆనందాన్ని పంచాడు. కానీ చివరకు అసెంబ్లీలో గట్టి షాకిచ్చాడు.. ఏపీకి మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్టు హైకోర్టులో మెమో దాఖలు చేయడం.. ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్టు బిల్లు పెట్టారు.ఈ బిల్లు సందర్భంగా సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు.
Also Read: విశాఖపట్నమే ఏపీకి ఏకైక రాజధాని.. సంచలన నిర్ణయం దిశగా జగన్?
ఏపీకి మూడు రాజధానుల బిల్లు రద్దుపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతానికి బిల్లును వెనక్కి తీసుకుంటూనే పూర్తి మార్పులతో మళ్లీ సభ ముందుకు తీసుకొస్తామని ప్రత్యర్థుల ఆనందాన్ని నీరుగారుస్తూ గట్టి షాకిచ్చారు జగన్.ప్రస్తుతానికి మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటూనే పూర్తి మార్పులతో మళ్లీ సభ ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
2014లో రాజధాని ఏర్పాటుపై చంద్రబాబు అనాలోచిత నిర్ణయం తీసుకున్నారని జగన్ అన్నారు. అప్పట్లో అన్ని నివేదికలను ఉల్లంఘించి రాజధానిని ఏర్పాటు చేశారని విమర్శించారు. ఈ ప్రాంతమంటే తనకు ఎలాంటి వ్యతిరేకత లేదు.. తన ఇల్లు కూడా ఉందన్నారు. నిజానికి ఈ ప్రాంతమంటే తనకు ప్రేమ ఉందన్నారు.
రాజధాని ప్రాంతం అటు గుంటూరు, విజయవాడలో లేదన్నారు. కనీస సౌకర్యాలు ఇక్కడ లేవని.. వాటికే లక్ష కోట్లు అవుతాయని.. అప్పుల్లో ఉన్న ఈ రాష్ట్రానికి అంత భరించలేదన్నారు. రాష్ట్రంలో అన్ని సౌకర్యాలున్న విశాఖపట్నాన్ని రాజధానిగా ఎంపిక చేశామన్నారు. విశాఖను చేస్తే ఐదేళ్లలో హైదరాబాద్ తో పోటీపడే పరిస్థితి ఉంటుందన్నారు.
సీఎం జగన్ చేసిన ప్రకటన ప్రకారం.. చట్టపరంగా.. న్యాయపరంగా అన్ని సమాధానాలు ఇస్తూ బిల్లును మరింత బలంగా మెరుగుపరిచి కోర్టుల్లో కొట్టుడు పోకుండా అవసరమైన మార్పులతో మూడు రాజధానుల బిల్లుతో సభ ముందుకు వచ్చేందుకు జగన్ నిర్ణయించారు. ఈసారి ఎక్కడా కూడా మూడు రాజధానుల బిల్లు ఆగకుండా మాత్రమే జగన్ పాత బిల్లును వెనక్కి తీసుకున్నారు. మళ్లీ కొత్త బిల్లుతో ముందుకొస్తున్నారు. అంతేకానీ మూడు రాజధానులపై జగన్ వెనక్కి తగ్లేదు. విశాఖను రాజధాని చేయడానికి కాదు.. అవే మూడు రాజధానులు కానీ.. కాస్త గ్యాప్ ఇచ్చి సమగ్రంగా ఏర్పాటు చేస్తారన్న మాట.. దీన్ని బట్టి జగన్ కర్ర విరగకుండా పామును చంపేలా తగ్గేదే లే అన్నట్టుగా వ్యవహరించారని చెప్పొచ్చు.
మూడు రాజధానులు రద్దు అవుతాయని.. ఏపీకి అమరావతియే రాజధాని అని అక్కడి రైతులు సంబరాలు చేసుకొని స్వీట్లు పంచుకున్నారు. మీడియా ఎదుట డ్యాన్సులు చేశారు. టీడీపీ శ్రేణులు ఆనందపడ్డారు. కానీ జగన్ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గట్టి షాక్ ఇచ్చాడు. మూడు రాజధానులపై జస్గ్ గ్యాప్ ఇచ్చాడు. మళ్లీ పెడుతానన్నాడు. దీంతో చంద్రబాబు ఏడుపును, సానుభూతిని డైవర్ట్ చేయడానికే జగన్ ఇదంతా చేశాడా? నిన్న కేసీఆర్ ను కలవడంతో ఆయన సూచన మేరకే ఈ డైవర్షన్ పాలిటిక్స్ ను అమలు చేశాడా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: మోడీ బాటలో జగన్.. మూడు రాజధానులపై సంచలన నిర్ణయం.. కేసీఆరే కారణమా?