Kajal: కాజల్ పాప గర్భవతి అని ఊరంతా తెలుసు. అయినా ఈ ముదురు హీరోయిన్ మాత్రం తన కడుపును దాచడానికి నానాపాట్లు పడుతుంది. ఎందుకమ్మా చక్కగా అమ్మతనాన్ని ఆస్వాదించక, లేనిపోని మేకప్ లు వేసుకుని పొట్ట దాచుకుని మరీ ఫోజులు ఇవ్వడం అవసరమా ? అంటే, ఒప్పుకోవడం లేదు. అదేంటో గానీ, ఈ పెళ్లి అయినా హీరోయిన్లు అంతా గర్భవతలు అవ్వడానికి అసలు ఇష్టపడరు. అందం తరిగిపోతుందని వారి బాధ.

నిజమే, హీరోయిన్ అంటే అందం మాత్రమే ఉంటుంది అనుకునే ప్రేక్షకుల ఈలలు గోలల మధ్య వచ్చిన హీరోయిన్స్ కదా. వాళ్లకు ఆ ఫీలింగ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం తాను గర్భవతిని అనే విషయాన్ని దాచి ఉంచడానికి పడుతున్న ఇబ్బందులే హాస్యాస్పదంగా ఉన్నాయి. అభిమానులు గర్భవతిగా కాజల్ ఎలా ఉంటుందో చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాజల్ మాత్రం తన గర్భాన్ని చూపించడంలేదు. నిజమే, తాను గర్భవతి అన్న విషయాన్ని ఇప్పటివరకు కాజల్ అగర్వాల్ బయట పెట్టలేదు. కాకపోతే ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా విషయం మాత్రం అందరికీ తెలిసిపోయింది. కేవలం గర్భం కారణంగానే ఆమె కొన్ని సినిమాల నుంచి కూడా తప్పుకొంది.
ఆ సినిమా నిర్మాతలకు తాను ప్రెగ్నెంట్ అని చెప్పి ఆ సినిమాల నుంచి బయటికి వచ్చింది. కాబట్టి.. కాజల్ త్వరలో తల్లి కాబోతుందన్న విషయం అందరికీ తెలిసిపోయింది. ఐతే, అందరికీ తెలిసిపోయినా కాజల్ మాత్రం ఇప్పటికీ స్లిమ్ గా ఉన్న ఫోటోలనే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ హడావిడి చేస్తోంది. ఎక్కడా ఆమె గర్భవతి అన్న ఛాయలు లేకుండా జాగ్రత్త పడుతుంది.
Also Read: Simbu: రాజకీయపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొన్నాం.. ఇప్పుడు ఇక్కడ నిలబడ్డాం- శింబు
తాజాగా కాజల్ షేర్ చేసిన ఫోటోలు చూస్తే.. కాజల్ నిజంగా గర్భవతి కాలేదా? అన్న అనుమానాలు కలుగుతాయి. ఏది ఏమైనా కాజల్ ఇలా ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తోంది ? ఆమెకే తెలియాలి. నెటిజన్లు కాజల్ కడుపు ఎక్కడ దాచావవమ్మా ? కాస్త దాన్ని క్లారిటీగా చూపించొచ్చుగా..’ అంటూ మెసేజ్ లు పెడుతున్నారు.
Also Read: RC15: చరణ్- శంకర్ కాంబో సినిమా శాటిలైట్ రైట్స్ ఎవరివంటే?