AP PRC: ఎన్నోరోజుల నుంచి కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు సంక్రాంతి పండుగ పూట జగన్ తీపికబురును అందించాడు. వారి చిరకాల కోరిక పీఆర్సీని ప్రకటించడంతోపాటు మరిన్ని వరాలు కురిపించారు. తాజాగా ప్రభుత్వం నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గత కొంతకాలంగా వివాదంగా మారిన పీఆర్సీ విషయంలో జగన్ ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఉద్యోగులకు 23శాతం ఫిట్ మెంట్ ప్రకటించారు. పెండింగ్ లో ఉన్న సీపీఎస్ పైనా జులై 30లోపు క్లారిటీ ఇచ్చేస్తానన్నారు.
ఇక ఉద్యోగులకు మరింత జోష్ నిచ్చేలా కొత్త జీతాలు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తున్నాయని క్లారిటీ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ఏప్రిల్ 30వ తేదీలోపు చెల్లిస్తామని జగన్ హామీ ఇచ్చారు.
ఇక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఈ ఏడాది జులై నుంచి రెగ్యులర్ చేస్తున్నారు. సొంత ఇళ్లు లేని ఉద్యోగులకు స్మార్ట్ టౌన్ లో ఇళ్లు కట్టిస్తానన్నారు. ఏపీ ఉద్యోగుల సమస్యలు రెండు వారాల్లో క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు.
అయితే ఏపీ ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులకు వివరించిన జగన్ బుజ్జగించి మరీ వారికి ఫిట్ మెంట్ విషయంలో కాంప్రమైజ్ చేసినట్టు తెలిసింది. అందరినీ ఒప్పించి 23శాతం ఫిట్ మెంట్ ఇవ్వునున్నట్లు ప్రకటించారు. ఇక ఉద్యోగులకు పీఆర్సీ , ఫిట్ మెంట్ తో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఏపీ ప్రభుత్వంపై 10247 కోట్ల అదనపు భారం పడనుంది.