Vanama Raghava: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన వనమా రాఘవరావు ఘటన ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ఆయన విషయంలో స్పందించని టీఆర్ ఎస్.. ఎట్టకేలకు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ప్రతిపక్షాల నుంచి, ఇటు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఆయనపై వేటు వేసినట్టు తెలుస్తోంది. కాగా కేసీఆర్ ఆదేశాల ప్రకారమే వేటు వేసినట్టు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇదే విషయం మీద పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు జిల్లా ఇన్‌చార్జ్ నరేష్ రెడ్డి వివరాలను వెల్లడించారు.
ఇక నిన్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు.. తనకొడుకు విషయంలో ఓ లేఖను విడుదల చేశారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతారని అందులో చెప్పారు. కానీ మీడియా ముందు మాట్లాడక ముందే.. ఆయన్ను కొత్తగూడెం పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారనే వార్తలు వచ్చాయి. కానీ ఆయన్ను అరెస్టు చేయలేదని పాల్వంచ ఏసీపీ స్పష్టం చేశారు. దీంతో అసలు ఆయన్ను అరెస్టు చేశారో లేదో తెలియక గందరగోళం నెలకొంది.
Also Read: ఈటలకు అలా.. ‘వనమా’కు ఇలా..కేసీఆర్ ది ధృతరాష్ట్ర తీరేనా?
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఏ-1 గా ఆరోపనలు ఎదుర్కొంటున్నారు రాఘవ. తన భార్యను తన వద్దకు పంపాలంటూ రాఘవ హుకూం జారీ చేశారని ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో రామకృష్ణ ఆరోపించారు. ఈ వీడియో బయటకు రావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో కూడా అనేక కేసుల్లో ఆయన తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఒక ఎస్సై ఆత్మహత్య కేసులో కూడా రాఘవరావు ఏ-1గా ఉన్నారు. 2006 నుంచి 2013, 2017 అలాగే వరుసగా ఈ మూడేంట్లు కూడా ఆయన మీద కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఒక గిరిజన మహిళకు చెందిన భూమి విషయంలో ఆమె మీద దాడి చేయించారనే ఆరోపనలు అప్పట్లో సంచలనం రేపాయి. ఇలా వరుస వివాదాలతో ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రావుకు ఆయన కలంకం తెస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ పెత్తనం మొత్తం ఆయన చేతుల్లోనే పెట్టుకుంటారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారనేది ఎవరికీ తెలియట్లేదు. ప్రస్తుతం ఆయన కోసం ఇంటికి నోటీసులు అతికించారు పోలీసులు. ఆయన కోసం అంతటా గాలిస్తున్నారు.
Also Read: అతను మొదటి నుంచి అలానే.. అరాచకాలకు కేరాఫ్ ఆ ఎమ్మెల్యే కొడుకు..!