Andhra boy and American girl : ప్రేమ ఎప్పుడు, ఎవరికి, ఎలా పుడుతుందో ఎవరు ఈ ప్రేమలో పడుతారో తెలియడం, ఊహించడం కూడా కష్టమే. ప్రేమ చాలా గొప్పది. కానీ ప్రేమిస్తే మాత్రమే గొప్పది. నేటి కాలంలో చాలా మంది అట్రాక్షన్ కు కూడా ఇదే పేరు పెట్టుకుంటున్నారు. అయితే ప్రేమకు హద్దులు, ఎల్లలు, మతం, కులం వంటివి ఏవి కూడా ఉండవు. ప్రేమిస్తే ఇలాంటివి అడ్డు రావు. దేశం ఏదైనా సరే మతం, కులం ఏదైనా సరే అంటుంది ప్రేమ. ఇప్పుడు ఓ జంట ప్రేమించుకోవడానికి వయసు, దేశాన్ని పట్టించుకోలేదు. మరి వారెవరు? ఎక్కడ ఉంటారు వంటి వివరాలు తెలుసుకుందామా?
Also Read : పెళ్లి పీటలెక్కని రతన్ టాటా లవ్ స్టోరీ.. ఆమె కోసం జీవితాంతం బ్రహ్మచారిగా..
ప్రేమ విషయానికి వస్తే, దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన ప్రేమకథలు ఎన్నో ఉన్నాయి. సేమ్ అలాంటిదే ఈ ప్రేమ కథ. ఈ మహిళ ఒక అమెరికన్ మహిళ. ఈమెకు సంబంధించి అలాంటి ఒక ఆసక్తికరమైన కథ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. ఒక అమెరికన్ మహిళ తను ప్రేమించిన అబ్బాయిని వివాహం చేసుకోవడానికి వేల మైళ్లు ప్రయాణించింది. ఆ స్త్రీ ప్రేమలో పడిన ఆ వ్యక్తి ఎవరో కాదు. మన తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రంలోని ఒక మారుమూల గ్రామానికి చెందినవాడు ఆ వ్యక్తి.
అమెరికన్ లేడీ జాక్వెలిన్ ఫోరెరో ఒక ఫోటోగ్రాఫర్ చందన్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఆ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో చందన్‌తో స్నేహం చేసింది. వారు చాలా మాట్లాడారు, తరువాత క్రమంగా ఈ స్నేహం ప్రేమగా మారింది. ఆ పురుషుడు ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లోని సింప్లిసిటీ, ఆప్యాయతకు ఆ మహిళ అట్రాక్ట్ అయింది.
అలా మొదలైంది..
వారిద్దరి ప్రేమకథ ఒక సాధారణ ‘హాయ్’తో ప్రారంభమైంది. అది హృదయపూర్వక సంభాషణగా మారింది. తరువాతి 14 నెలల్లో, వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని ప్రేమలో పడ్డారు. ఈ జంట ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
“14 నెలలు కలిసి ప్రయాణించి ఇప్పుడు ఒక కొత్త అధ్యాయానికి సిద్ధం అవుతున్నాను” అని ఫోరెరో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాశారు. 45 సెకన్ల వీడియోను షేర్ చేస్తూ, ఆ మహిళ ఒక సాధారణ సందేశం ఎలా విడదీయరాని బంధంగా మారిందో వివరిస్తూ చెప్పింది.
అందులో తాను ఏమని చెప్పిందంటే? నేను మొదట చందన్‌కు మెసేజ్ పంపాను’ అని రాసింది. అతని ప్రొఫైల్ ద్వారా అతను వేదాంతశాస్త్రం తెలిసిన ఒక ఉద్వేగభరితమైన క్రైస్తవ వ్యక్తి అని నేను తెలుసుకున్నాను అని తెలిపింది ఆమె. అయితే ఈ జాక్వెలిన్ చందన్ కంటే 9 సంవత్సరాలు పెద్దది. వారి బంధం ఇన్‌స్టాగ్రామ్ సందేశాలు,వీడియో కాల్స్ ద్వారా ఏర్పడింది. 7 నెలల్లోనే, జాక్వెలిన్ అతన్ని వివాహం చేసుకోవడానికి భారతదేశానికి వచ్చింది. మూడున్నర సంవత్సరాల తర్వాత, చందన్ ఆమె కోసం అమెరికాకు వచ్చాడు. మొత్తం మీద ఇద్దరు ఇలా ఒకటయ్యారు. దేశాలను దాటి వారి ప్రేమను గెలిపించుకున్నారన్నమాట. ఇదండీ వారి ప్రేమ కథ.
Also Read : ద్వేషంతో మొదలైంది.. ప్రేమగా మారింది.. పీఆర్ శ్రీజేష్ లవ్ స్టోరీ సినిమాలకు తీసిపోదు..