Homeక్రీడలుPR Sreejesh love story: ద్వేషంతో మొదలైంది.. ప్రేమగా మారింది.. పీఆర్ శ్రీజేష్ లవ్ స్టోరీ...

PR Sreejesh love story: ద్వేషంతో మొదలైంది.. ప్రేమగా మారింది.. పీఆర్ శ్రీజేష్ లవ్ స్టోరీ సినిమాలకు తీసిపోదు..

PR Sreejesh love story: ఓ యువతి, ఓ యువకుడు కాలేజీలో చదువుకుంటారు. మొదటినుంచి ఒకరికి ఒకరు అంటే పడదు. ద్వేషించుకుంటారు. దూషించుకుంటారు. ఆ తర్వాత ఒకానొక రోజు ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఇష్టమేర్పడుతుంది. ఆ తర్వాత అది ప్రేమగా మారుతుంది. అనంతరం దానిని వివాహంతో మరింత సుస్థిరం చేసుకుంటారు. చదువుతుంటే ఏదో సినిమా స్టోరీ లాగా అనిపిస్తుంది కదూ.. సేమ్ ఇటువంటి స్టోరీనే భారత దిగ్గజ హాకీ ఆటగాడు పీ. ఆర్ శ్రీ జేష్ జీవితంలో చోటుచేసుకుంది. తన ప్రేమ, పెళ్లికి సంబంధించి శ్రీ జేష్ ఆసక్తికరమైన కథను ఇటీవల కేరళలోని విలేకరులతో చెప్పుకొచ్చాడు.

జీవీఎం స్పోర్ట్స్ స్కూల్లో చదువుకున్నారు

పెళ్లికి ముందు శ్రీ జేష్, అనీష్య కేరళలోని కన్నూర్ ప్రాంతంలో ఉన్న జీవీఎం స్పోర్ట్స్ స్కూల్లో చదువుకున్నారు.
శ్రీ జేష్ మొదటి నుంచి అదే స్కూల్లో చదువుకున్నాడు. శ్రీ నీష్య మాత్రం మధ్యలో వచ్చింది. అప్పటివరకు టాపర్ గా ఉన్న శ్రీ జేష్.. అనీశ్య రాకతో ఒకసారిగా రెండవ స్థానానికి పడిపోయాడు. అనీశ్య మొదటినుంచి లాంగ్ జంప్ లో అద్భుతంగా రాణించేది. ఇది శ్రీ జేష్ కు ఏ మాత్రం నచ్చేది కాదు. ” నేను ఆ స్పోర్ట్స్ స్కూల్లో టాపర్ గా ఉండేవాణ్ణి. కానీ ఆమె రాకతో మొత్తం మారిపోయింది. అన్ని విభాగాలలో ఆమెదే పై చేయిగా ఉండేది. దీంతో ఆమెపై నాకు విపరీతమైన ద్వేషం ఉండేది. ఆమె కూడా అలానే నాపై కోపాన్ని ప్రదర్శించేది. ఇద్దరం బద్ద శత్రువుల్లాగా ఉండేవాళ్ళం. తర్వాత ఏం జరిగిందో తెలియదు.. ఒకరిపై ఒకరికి ఇష్టం పెరిగింది. అది కాస్త ప్రేమ అయింది. ఆ ప్రేమను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు పెళ్లి చేసుకున్నామని” శ్రీ జేష్ పేర్కొన్నాడు.

భార్యా, పిల్లల పేర్లతో రూపొందించిన హాకీ స్టిక్స్ తో..

శ్రీ జేష్, అనీశ్య వివాహం 2013లో జరిగింది. ఆమె కేరళ రాష్ట్రంలో ఒక ఆయుర్వేద వైద్యురాలిగా పని చేస్తోంది. శ్రీ జేష్ మాత్రం హాకిని కెరియర్ గా ఎంచుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్ లో తన భార్య పిల్లల పేర్లు రూపొందించిన హాకీ స్టిక్స్ ఉపయోగించాడు. “నా పిల్లలు రెండు కళ్ళతో సమానం. వారిద్దరిలో ఎవరి ఇష్టమో నేను చెప్పలేను. నా సతీమణి మాత్రం కచ్చితంగా హృదయం. మ్యాచ్లో స్టిక్స్ మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అందువల్లే నా కొడుకు, కూతురు పేర్లు రాసి ఉన్న స్టిక్స్ ఉపయోగించాను. షూట్ అవుట్ సమయంలో ఒకటే స్టిక్ వాడాలి. ఆ సమయంలో నేను నా భార్య పేరుతో రూపొందించిన స్టిక్ వాడాను. నా పిల్లలకు నా పేరు ఇబ్బంది కాకూడదు. అందువల్లే వారిని స్వేచ్ఛగా పెంచుతున్నాను. నా ఫేమ్ వల్ల వల్ల చదువులు పాడవకూడదని” శ్రీ జేష్ వెల్లడించాడు.

పారిస్ ఒలంపిక్స్ లో శ్రీ జేష్ భారత హాకీ జట్టుకు కాంస్యం అందించాడు. టోక్యో ఒలంపిక్స్ లోనూ ఇదే స్థాయిలో ప్రతిభ చూపించాడు. కూడా భారత జట్టు కాంస్యం దక్కించుకుంది. గోల్ కీపర్ గా శ్రీ జేష్ అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా పారిస్ ఒలంపిక్స్ లో గ్రేట్ బ్రిటన్ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్ లో శ్రీ జేష్ అనితర సాధ్యమైన ఆట తీరు కనబరిచాడు. ఏకంగా 13 గోల్స్ ను అడ్డుగోడలా నిలబడి అడ్డగించాడు. పారిస్ ఒలంపిక్స్ లో మెడల్ గెలిచిన అనంతరం తన సుదీర్ఘ కెరియర్ కు గుడ్ బై చెప్పాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular