Homeజాతీయ వార్తలుPoisonous trees: బ్రిటిషర్లు నాటిన విష వృక్షాలు.. భారత జీవవైవిధ్యానికి ముప్పు

Poisonous trees: బ్రిటిషర్లు నాటిన విష వృక్షాలు.. భారత జీవవైవిధ్యానికి ముప్పు

Poisonous trees: భారత దేశాన్ని 200 ఏళ్లు పాలించిన బ్రిటిషర్లు.. మన వనరులను దోచుకుపోయారు. ఇక్కడ పండించిన విలువన పంటలను విదేశాలకు ఎగుమతి చేసి అమ్ముకుని సమ్ము చేసుకున్నారు. స్వదేశంలో మనల్ని బానిసలుగా చూశారు. ఇక ఇదే సమయంలో మనకు లేని అలవాట్లను నేర్పించారు. టీ, కాఫీ, ఆదివారం సెలవు వంటివి బ్రిటిషర్ల నుంచి వచ్చినవే. ఇక బ్రిటిషన్లు దేశాన్ని వీడి వెళ్తూ వెళ్తూ.. మన దేశంలో కొన్ని విష వృక్షాలను కూడా నాటారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపించే సర్కార్‌ తుమ్మ ఒకటి. ఇది చాలా ప్రమాదకరమైనది. పర్యావరణానికి ఎలాంటి ఉపయోగం లేదు. ఇక లూంటానా మొక్క మరొకటి. ఒకప్పుడు అందమైన ఆకర్షణగా కనిపించింది. కోల్‌కతా రాయల్‌ బొటానికల్‌ గార్డెన్‌లో పెంచిన ఈ మొక్క రంగురంగుల పూలతో ప్రజలను ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు ఇది స్థానిక ప్రకృతికి శత్రువుగా మారింది.

అందం వెనుక విషం..
భారత వాతావరణం లూంటానాకు అనుకూలంగా ఉండటంతో ఇది వేగంగా వ్యాపించింది. రోడ్ల పక్కలు, అడవులు, వ్యవసాయ భూములను ఆక్రమించుతూ స్థానిక మొక్కలను పోటీపడి కసిగా మింగేస్తోంది. పાలు అందంగా కనిపించినా, దాని వేగవంతమైన వ్యాప్తి వల్ల ఇది దంపత్య శత్రువుగా మారింది.

జీవవైవిధ్యానికి ముప్పు
స్థానిక చెట్లు, మొక్కలు, జంతువుల ఆహారం, నివాసం కోల్పోతున్నాయి. భారతదేశంలో విస్తృతంగా వ్యాపించిన ఈ మొక్క ఆక్వాటిక్, టెరెస్ట్రియల్‌ ఎకోసిస్టమ్‌లను దెబ్బతీస్తోంది. పర్యావరణ నిపుణులు దీన్ని ’ఇన్వాసివ్‌ స్పీసీస్‌’గా గుర్తిస్తూ, తొలగించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.

ఈ సంఘటన ఆకర్షణీయత కోసం విదేశీ మొక్కలు తీసుకురాకూడదనే పాఠం. లూంటానా వంటి మొక్కలు దీర్ఘకాలంలో ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వాలు, స్థానిక సంఘాలు కలిసి దాని వ్యాప్తిని అరికట్టి, స్థానిక జీవవైవిధ్యాన్ని కాపాడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular