Andaman and Nicobar Island Details :  భారత్ కు అత్యంత కీలక ప్రాంతం అండమాన్ నికోబార్

Andaman and Nicobar Island Details : అండమాన్ నికోబార్ ఏ విధంగా భారత్ కు గొప్ప వరం అన్న సంగతి తెలుసుకుందాం. అండమాన్ నికోబార్ 572 ద్వీపాలుగా ఉన్నాయి. ఇందులో రెండు భాగాలుగా ఉన్నాయి. అండమాన్ 325 ద్వీపాలు, నికోబార్ 247 ద్వీపాలు ఉన్నాయి. అండమాన్ ఉత్తరాన.. నికోబార్ దక్షిణాన ఉంటాయి. ఈ రెండింటి మధ్యన 150 వెడల్పు ఉన్న 10 డిగ్రీ ఛానల్ సముద్రం ఉంది. అంతర్జాతీయ షిప్పులు ఈ మధ్య గుండా కూడా వెళతాయి. […]

Written By: NARESH, Updated On : November 26, 2022 6:39 pm
Follow us on

Andaman and Nicobar Island Details : అండమాన్ నికోబార్ ఏ విధంగా భారత్ కు గొప్ప వరం అన్న సంగతి తెలుసుకుందాం. అండమాన్ నికోబార్ 572 ద్వీపాలుగా ఉన్నాయి. ఇందులో రెండు భాగాలుగా ఉన్నాయి. అండమాన్ 325 ద్వీపాలు, నికోబార్ 247 ద్వీపాలు ఉన్నాయి. అండమాన్ ఉత్తరాన.. నికోబార్ దక్షిణాన ఉంటాయి. ఈ రెండింటి మధ్యన 150 వెడల్పు ఉన్న 10 డిగ్రీ ఛానల్ సముద్రం ఉంది. అంతర్జాతీయ షిప్పులు ఈ మధ్య గుండా కూడా వెళతాయి.

ఇవాళ అండమాన్ నికోబార్ దీవులు మయన్మార్ దేశానికి దగ్గరగా ఉంటాయి. భారత్ కంటే బర్మాకే ఇవి దగ్గర. నికోబార్ దీవుల నుంచి 80 కి.మీలకు దూరంలోనే ఇండోనేషియాకు చెందిన సుమత్రో దీవులు ఉంటాయి. నికోబార్ కు తూర్పున థాయిలాండ్ అతిదగ్గరగా ఉంటుంది.

అండమాన్ నికోబార్ కు మనకంటే కూడా దక్షిణాసియా దేశాలు దగ్గరగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వ్యాపారంలో 40శాతం వ్యాపారం ‘మలక్కా జలసంధి’ నుంచే జరుగుతుంది. మలక్కా జలసంధి గ్రేట్ నికోబార్ ద్వీపానికి 8 నాటికల్ మైళ్ల దూరం నుంచి వెళుతుంది. అంత కీలకమైన ప్రదేశంలో మన అండమాన్ నికోబార్ ద్వీపాలున్నాయి. అత్యంత రద్దీ గల రూట్ ను శాసించే స్థితిలో భారత్ ఉంది.

అండమాన్ నికోబార్ దీవులను మొట్టమొదటి సారిగా మలేషియా దేశస్థులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజలను బానిసలుగా చేసుకున్నారని చరిత్ర చెబుతోంది. మొదట్లో దీన్ని ‘హండుమాన్’గా.. ఆ తర్వాత అండమాన్ గా రూపాందరం చెందింది.

నికోబార్ ను చోళ రాజులు ‘మాలక్కవరం’ అని పిలిచారు. ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకొని ఇండోనేషియా పై దాడి చేశారు. వారి పేరు మీదుగా నికోబార్ గా మారింది.

భారత్ కు అత్యంత కీలక ప్రాంతమైన ‘అండమాన్ నికోబార్’ దీవులపై ‘రామ్ ’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.