
తన ఆయుర్వేద కరోనా నివారణ మందుతో తగ్గించేసిన ఆనందయ్య తాజాగా సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వ అనుమతి రాగానే మందు తయారు చేసి అందరికీ పంపిణీ చేస్తానని.. అనుమతి రాకపోతే అప్పటివరకు చేయనని ఆనందయ్య స్పష్టం చేశారు.
కరోనా మందు పంపిణీ చేస్తున్నారని తన వద్దకు వస్తున్నారని.. సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నారని.. అదంతా అవాస్తమని స్పష్టం చేశారు. తాను పంపిణీ చేస్తున్న కరోనా మందుకు ఇంకా ప్రభుత్వ అనుమతులు రాలేదని ఆనందయ్య స్పష్టం చేశారు.వదంతులు నమ్మి ఎవరూ కృష్ణపట్నంకు రావొద్దని ఆనందయ్య విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ అనుమతి రాగానే మందు తయారు చేసి అందరికీ పంచుతానని ప్రజలకు భరోసాను ఆనందయ్య ఇచ్చారు. ముందుగానే తేదీ ప్రకటించి మరీ ఇస్తానని తెలిపారు.
ఇప్పటికే ఆనందయ్య మందు పంపిణీ జరిగేలా చూడాలని త్వరగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి సూచించింది. మందుపై పరీక్షల నిర్వహణ పేరుతో ఆలస్యం చేయడం తగదని స్పష్టం చేసింది.
ఈనెల 29న ఆయూష్ శాఖ నుంచి ఆనందయ్య మందుపై నివేదిక వస్తుందని ఏపీప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే ఈ సోమవారంలోపు అయినా ఆనందయ్య మందుకు అనుమతి వచ్చి పంపిణీ చేస్తారు కావచ్చని ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.