‘రిపబ్లిక్ ’ మూవీ ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అటు చిత్రపరిశ్రమను.. ఇటు ప్రభుత్వాన్ని ఓ కుదుపు కుదిపేసింది.ఈ ప్రసంగంతో చిత్ర పరిశ్రమలో వెన్నెముక గల ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని నిరూపించబడింది. ఎందుకు పవన్ ప్రసంగం సంచలనమైంది..? ఎందుకింతగా వివాదం అయ్యింది?
ప్రధానంగా పవన్ కళ్యాణ్ వచ్చింది సినిమా ఫంక్షన్ కు కాబట్టి ఆయన మాట్లాడింది మొత్తం సినీ పరిశ్రమ చుట్టూ అల్లుకున్న సమస్యలపైనే సాగింది. కానీ దానికి మీడియా మసాలా అద్ది రచ్చ చేసింది. అగ్గి రాజేసింది. పవన్ ప్రధాన ఫోకస్ చిత్రపరిశ్రమ మీదనే సాగింది. చిత్రపరిశ్రమపై సమాజానికి ఉన్న వ్యతిరేక భావన ఎంత తప్పో పవన్ కళ్యాణ్ ప్రసంగంలో ఉదాహరణలతో సెటైర్లతో చాలా చక్కగా వివరించాడు.
అయితే పవన్ ప్రసంగించిన కీలక పాయింట్లను, సమస్యలను పక్కనపెట్టి మీడియా ఏదేదో చూపిస్తున్నారు. దానిపై ఏపీ మంత్రులు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు.
ఇక పవన్ ప్రసంగంలోని మరో కీలక విషయం.. చిత్రపరిశ్రమ ఎప్పుడూ ప్రభుత్వంపై ఆధారపడడం లేదని.. ప్రభుత్వమే తమపై ఆధారపడుతోందని వివరించాడు. పన్నుల రూపేణా చిత్రపరిశ్రమనే ప్రభుత్వానికి బోలెడంత ఆదాయాన్ని సమకూరుస్తోందని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే చిత్రపరిశ్రమను చిన్నచూపు చూడొద్దని చెప్పాడు. అదే సమయంలో చిత్రపరిశ్రమలోని పెద్దలు నిర్భయంగా మాట్లాడాలని చెప్పాడు.
పవన్ ఏదో గాలిలో మాట్లాడకుండా.. చాలా పాయింట్ల వారీగా ఏపీ ప్రభుత్వాన్ని నిర్మాణాత్మక ప్రశ్నలు సంధించారు. మోహన్ బాబు, చిరంజీవి లాంటి వారు ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టారు. ఇలా చిత్ర పరిశ్రమలో వెన్నుముక కలిగిన ఏకైక నాయకుడిగా పవన్ కళ్యాణ్ నిలిచారు. పవన్ ప్రసంగంపై ‘రామ్ టాక్’ విశ్లేషణ స్పెషల్ వీడియో మీకోసం..