పోసాని కృష్ణమురళి.. పవన్ ను ఉద్దేశించి.. ఇన్ డైరెక్ట్ గా పవన్ పై చాలా నీచమైన పచ్చి నిందలు మోపిన సంగతి తెలిసిందే. అవకాశాలిస్తానని ఓ పంజాబ్ యువతిని మోసగించాడని, మరి పవన్ ఆ యువతికి న్యాయం చేయగలడా ? చేస్తే పవన్ కు గుడి కడతా’ అంటూ ఇలా చాలా తెలివిగా ఆరోణలు చేశాడు పోసాని. అయితే జగన్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న పోసాని.. పవన్ పై ఈ రేంజ్ లో విరుచుకు పడతాడని మెగా కాంపౌండ్ ఊహించలేదు.

ఒక విధంగా నటుడిగా పోసానికి లైఫ్ ఇచ్చింది మెగా ఫ్యామిలీనే. సినీ పరిశ్రమలో ఇప్పటికీ పోసానికి అవకాశాలు వస్తున్నాయి అంటే.. కారణం మెగా ఫ్యామిలీనే. ఆ ఫ్యామిలీ పోసానిని తమవాడిగా చూసింది. అందుకే..మెగాస్టార్ చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో పోసానికి పిలిచి మరీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. కానీ పోసాని దారుణంగా ఓడిపోయాడు.
అయినా మెగాస్టార్ మాత్రం పోసానికి తన పార్టీ తరపున గుర్తింపు ఇచ్చారు. కానీ, పోసాని అప్పుడు కూడా చిరంజీవి పై విమర్శలు చేసి టీడీపీ కి సపోర్ట్ గా మాట్లాడాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో.. చంద్రబాబును అడ్డమైన తిట్లు తిట్టి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. జగన్ భక్తుడిగా మారిపోయాడు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడ్డాడు.
అసలు జగన్ సన్నిహితులు కూడా ఇంతలా పవన్ పై కామెంట్స్ చేయలేదు. అలాంటిది పోసాని మాత్రం దారుణమైన ఆరోణలు చేశాడు. ఆ ఆరోపణల్లో ఎంత నిజం ఉందనేది పక్కన పెడితే.. పోసాని మాత్రం ‘మెంటల్ కృష్ణ‘గానే మాట్లాడాడు. పూటకో పార్టీ అన్నట్టు పోసాని రాజకీయ అభిలాష్ సాగింది. ఎట్నుంచి ప్యాకేజీ వస్తే అటు మారిపోవడం మెంటల్ కృష్ణకి అలవాటు అయిపోయింది.
ఒకప్పుడు పోసానికి సినీ రచయితగా లైఫ్ వచ్చిందన్నా.. ఆ తర్వాత కమెడియన్ వేషాలు వచ్చాయన్నా.. జీవితంలో ఎమ్మెల్యే టికెట్ వచ్చిందన్నా మెగాస్టార్ సపోర్ట్ ఉండబట్టే. లేకపోతే.. పోసానికి ఇప్పటికీ అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చేది. పోసాని, పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న రోజుల్లో.. చిరంజీవి గమనించి.. కొంతమంది చిన్న నిర్మాతలకు పోసాన్నిరికమండ్ చేశారు. ఆ పరిచయలే పోసానికి రచయితగా జీవితాన్ని ఇచ్చాయి.
కానీ పోసాని ఏమి చేశాడు ? జీవితాన్ని ఇచ్చిన మెగాస్టార్ కే వెన్నుపోటు పొడిచాడు. చివరకు మెంటల్ కృష్ణ లా మెంటల్ లెక్కినట్టు, పక్కా పేటీఎం బ్యాచ్ లా పవన్ పై నోటికొచ్చింది వాగేశాడు. కళ్ళుండీ కబోదిలా ఎలా నటించాలో ఈ మెంటలోడికి బాగా తెలుసు, కాబట్టి.. ఇప్పుడు కూడా అలాగే జగన్ తరఫున నటించి నాలుగు డైలాగ్ లు చెప్పి వెళ్ళాడు అనుకోవాలి.. అంతే.