కేసీఆర్ కు సెల్ఫీ వీడియో.. నిరుద్యోగుల ఉసురుబోసుకుంటున్నారా?

నిధులు.. నీళ్లు.. ఉద్యోగాలే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం మొదలైంది. యావత్ తెలంగాణ కేంద్రంతో కోట్లాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంది. తెలంగాణ ఏర్పడి ఆరేళ్లు గడిచిపోయినా ఇప్పటికీ వారి ఆశలు నెరవేరలేరడం లేదు. నిధులు.. నీళ్ల విషయంలో టీఆర్ఎస్ సర్కార్ కొంత పురోగతి సాధించిన ఉద్యోగాలను భర్తీ చేయడంలో మాత్రం దారుణంగా విఫలమైంది. ఎన్నికల హామీలో భాగంగా కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలోనే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనీ హామీ ఇచ్చినా నేటికీ అమలు చేయకపోవడం శోచనీయంగా మారింది. […]

Written By: NARESH, Updated On : September 20, 2020 12:15 pm
Follow us on

నిధులు.. నీళ్లు.. ఉద్యోగాలే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం మొదలైంది. యావత్ తెలంగాణ కేంద్రంతో కోట్లాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంది. తెలంగాణ ఏర్పడి ఆరేళ్లు గడిచిపోయినా ఇప్పటికీ వారి ఆశలు నెరవేరలేరడం లేదు. నిధులు.. నీళ్ల విషయంలో టీఆర్ఎస్ సర్కార్ కొంత పురోగతి సాధించిన ఉద్యోగాలను భర్తీ చేయడంలో మాత్రం దారుణంగా విఫలమైంది. ఎన్నికల హామీలో భాగంగా కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలోనే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనీ హామీ ఇచ్చినా నేటికీ అమలు చేయకపోవడం శోచనీయంగా మారింది.

Also Read: కార్పొరేట్ శక్తులకు అంతలా వణికిపోతున్నారెందుకు?

తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేసే TSPSC తన పని సక్రమంగా చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతోన్నాయి. ప్రభుత్వం, ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఖాళీలను కూడా భర్తీ చేయడంలో ఆ శాఖ పూర్తిగా విఫలమైందనే విమర్శలున్నాయి. TSPSCకి అసలు ఉద్యోగాల భర్తీపై ఓ ప్రణాళిక ఉందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతోన్నాయి. గత ఆరేళ్లలో కేవలం టెక్నికల్ ఉద్యోగాలు మినహా పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసిన దాఖలాలు లేవు. దీంతో టీఆర్ఎస్ సర్కార్.. TSPSCపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం నోటిఫికేషన్లు వేయకపోవడం.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలర్ చేస్తుండటం. పదవీ విరమణ వయస్సును కొన్ని శాఖల్లో పెంచుతూ నిరుద్యోగుల ఆశలపై నీళ్లుచల్లుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా నిరసన చేపడితే వెంటనే అరెస్టులు చేస్తూ వారి గొంతునొక్కే ప్రయత్నం చేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పిన లక్ష ఉద్యోగాలను కూడా గత ఆరేళ్లలో ప్రభుత్వం భర్తీ చేయలేకపోయిందటే నిరుద్యోగులపట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సంపత్ అనే నిరుద్యోగి సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ఓ సెల్పీ వీడియో విడుదల చేశారు. గత ఏడాది కాలంగా ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆవేదన వెలిబుచ్చాడు. ‘కేసీఆర్‌ సారూ.. కోటి ఆశలతో సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు కరువయ్యాయి. ఏ ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయో తెలియదు.. ఇన్‌టైంలో నోటిఫికేషన్లు వేయండి సారూ.. చదివీ చదివీ.. మైండంతా పోతోంది సారూ.. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆత్మహత్యాయత్నం చేస్తున్నాన’ని  ఓ సెల్ఫీ వీడియోలో ఆవేదనంతా వెళ్లగక్కాడు.

Also Read: ‘పరిటాల’ వారి పౌరుషం ఎక్కడ పాయె..?

ఓయూలో పీజీ పూర్తి చేసిన సంతప్ ఏడాది కాలంగా హైదరాబాద్లో గ్రూప్-2 కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు. సంపత్ తండ్రి టైలర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ కుమారుడికి కోచింగ్ ఇప్పిస్తున్నాడు. అయితే ఏడాది కాలంలో ఎలాంటి నోటిఫికేషన్లు రాకపోవడంతో శనివారం సంపత్ పురుగుల మందుతాగాడు. తన ఆవేదనంతా వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో తీశాడు. అపస్మారక  స్థితిలోకి వెళ్లిన సంపత్ ను వెంటనే తల్లిదండ్రులు గుర్తించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సంపత్ కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.