Katragadda Aruna : మేరిల్యాండ్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా కాట్రగడ్డ అరుణ.. కృష్ణా జిల్లా కుగ్రామం నుంచి ఎదిగిన ధీర వనిత

Katragadda Aruna : ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. అంతటా మనవాళ్లే పాగావేస్తున్నారు. బ్రిటన్ ప్రధానిగా మన భారత సంతతి రిషి సునక్ ఇటీవలే గద్దెనెక్కారు. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కమలా మన తమిళనాడు మూలాలు కలిగిన వారే.. ప్రపంచంలోని చాలా దేశాల్లో మన వాళ్లే అధ్యక్షులు, ప్రధానులు ఇతర కీలక పదవుల్లో ఉన్నారు. టెక్నాలజీ రంగంలోనూ సీఈవోలుగా రాణిస్తున్నారు. భారతీయులు లేని ప్రపంచాన్ని ఊహించకుండా ఉంది. ఇప్పుడు మన తెలుగు బిడ్డా అరుణ.. ఏపీలోని ఓ కుగ్రామం […]

Written By: NARESH, Updated On : November 9, 2022 7:14 pm
Follow us on

Katragadda Aruna : ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. అంతటా మనవాళ్లే పాగావేస్తున్నారు. బ్రిటన్ ప్రధానిగా మన భారత సంతతి రిషి సునక్ ఇటీవలే గద్దెనెక్కారు. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కమలా మన తమిళనాడు మూలాలు కలిగిన వారే.. ప్రపంచంలోని చాలా దేశాల్లో మన వాళ్లే అధ్యక్షులు, ప్రధానులు ఇతర కీలక పదవుల్లో ఉన్నారు. టెక్నాలజీ రంగంలోనూ సీఈవోలుగా రాణిస్తున్నారు. భారతీయులు లేని ప్రపంచాన్ని ఊహించకుండా ఉంది. ఇప్పుడు మన తెలుగు బిడ్డా అరుణ.. ఏపీలోని ఓ కుగ్రామం నుంచి ఏకంగా అమెరికాలోని మేరీల్యాండ్  లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ఎదిగారు.. ఇంతకీ ఈమె ఎవరు? ఎక్కడి వారు? ఎలా ఎదిగారు? అన్న దానిపై స్పెషల్ స్టోరీ..

అరుణా మిల్లర్ తో తానా మహిళా కన్వీనర్ ఉమా ఆరమండ్ల కటికి

– ఎవరీ కాట్రగడ్డ అరుణ?
భారతీయ మహిళ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. తెలుగు మహిళ అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో తన సత్తా చాటారు. కృష్ణా జిల్లాలోని కుగ్రామం వెంట్రప్రగడకు చెందిన కాట్రగడ్డ అరుణ అమెరికాలోని మెరీ ల్యాండ్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ఘన విజయం సాధించారు. ఇప్పటికే బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఎంపికై భారత ఖ్యాతిని ఇనుమడింపజేసిన తరుణంలో మరో తెలుగు మహిళ అగ్రరాజ్య రాజకీయాల్లో చెరగని ముద్ర వేయడం మన దేశానికే గర్వ కారణం. ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాలో మధ్యంతర ఎన్నికల కోలాహలం నడుస్తోంది. ఈ ఎన్నికలు అమెరికాన్ కాంగ్రెస్ కు చెందినవి. ప్రతీ రెండేళ్లకోసారి ఈ ఎన్నికలు జరగడం అక్కడ అనవాయితీ. సాధారణంగా అమెరికా అధ్యక్షుడు నాలుగేళ్ల పాటు పదవిలో ఉంటారు. అధ్యక్షుడు ప్రమాణస్వీకారం చేసిన రెండేళ్లకు అమెరికాన్ కాంగ్రెస్ కు ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడన్ పదవీ కాలం రెండేళ్లు ముగియడంతో ప్రస్తుతం అమెరికన్ కాంగ్రెస్ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ ఎలక్షన్ లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి.

-మెరీల్యాండ్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా అరుణ..
విదేశీ మూలాలు ఉన్న వ్యక్తులు అమెరికన్ కాంగ్రెస్ కు ఎన్నికవుతుండడం విశేషం. అందులో భారత సంతతికి చెందిన తెలుగు మహిళ కాట్రగడ్డ అరుణ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆమె ఎన్నికపై అమెరికాలోని భారతీయులు సైతం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. జాతి వివక్ష ఎక్కువగా ఉండే అమెరికా వంటి దేశంలో నల్ల జాతీయులు సైతం ఎన్నికవుతుండడం, బలమైన ముద్ర వేస్తుండడం ప్రజాస్వామ్య విలువకు మచ్చు తునకగా చెప్పవచ్చు. అటు అమెరికా రాజకీయాల్లో కూడా ఈ ఎన్నికలు హీట్ ను పెంచుతున్నాయి. రిపబ్లికన్ పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో సైతం డెమొక్రటిక్ లు పాగా వేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. మెరీల్యాండ్ గవర్నర్ గా డెమొక్రటిక్ పార్టీకి చెందిన వెస్ మొర్ ఎన్నికయ్యారు. మెరీ ల్యాండ్ నుంచి ఎన్నికైన మొట్ట మొదటి నల్ల జాతీయుడు మొర్ కావడం మరో విశేషం. ఆఫ్రికా నుంచి వలస వచ్చిన మొర్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డాన్ మొక్స్ పై విజయం సాధించారు. ఇక లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా కూడా నల్లజాతీయురాలు అయిన మన అరుణ ఎంపికవ్వడంతో ఇద్దరు కీలక గవర్నర్ స్థాయి వ్యక్తులు ఇతర దేశాలకు చెందినవారే కావడం సంచలనమైంది.

-కాట్రగడ్డ అరుణ చరిత్ర ఏమిటి?
మెరీ ల్యాండ్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా కాట్రగడ్డ అరుణ ఎన్నిక కావడంతో ఆమె మూలాలు తెలుసుకునే పనిలో అందరూ పడ్డారు. కృష్టా జిల్లా వెంట్రప్రగడలోనే మన అరుణ జన్మించారు. 1972 ఆమె కుటుంబం అమెరికా వెళ్లింది. తండ్రి కాట్రగడ్డ వెంకట రామారావు ఇది వరకూ ఐబీఎంలో పనిచేశారు. అరుణ విద్యాధికురాలు. ట్రాన్స్ పోర్టేషన్ ఇంజనీరింగ్ లో స్పెషలిస్టు. మిస్సౌరీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీస్ లో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. తరువాత మోంట్ గోమెరీకి షిఫ్ట్ అయ్యారు. తన మిత్రుడు డేవిడ్ మిల్లర్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అరుణ మిల్లర్ గా పిలవబడే ఈ భారత సంతతికి చెందిన మహిళ అత్యున్నత లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ఎన్నిక కావడం విశేషం.

రిపబ్లికన్ లపై పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్న డెమొక్రటిక్ లు వలసదారులైన వెస్ మూర్, అరుణ మిల్లర్ ల ద్వారా సఫలీకృతులు కావడంపై అమెరికా మీడియా ఆకాశానికి ఎత్తేస్తోంది. అమెరికా ప్రజాస్వామ్య విధానం ద్వారానే ఇది సాధ్యమైందని పతాక శీర్షికన కథనాలు వెలువరిస్తోంది.మన అరుణ గెలుపు ఖ్యాతిని భారతీయులు అంతా సంబరంగా చేసుకుంటున్నారు.