Homeజాతీయ వార్తలుJawaharlal Nehru: వారసత్వం పేరిట దాడి... నెహ్రూ ఖ్యాతిని కనుమరుగు చేసే యత్నం

Jawaharlal Nehru: వారసత్వం పేరిట దాడి… నెహ్రూ ఖ్యాతిని కనుమరుగు చేసే యత్నం

Jawaharlal Nehru: ‘వారసత్వం దేశానికి ప్రమాదకరం.. ఈ రాజకీయాలను కూకటి వేళ్లతో పెకిలించాలి. బంధుప్రీతి రాజకయాలతోపాటు అన్నిరంగాలకు పాకింది. ఇది దేశానికి అతిపెద్ద సవాల్‌.. ఈ జాడ్యం బారినుంచి దేశానికి విముక్తి కల్పించాలి’ ఇదీ 76వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు. ఇది వాస్తవమే.. ప్రస్తుతం రాజకీయం పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ వ్యాఖ్యల లక్ష్యం మాత్రం ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీనే. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ పేరిట ఒక ఉద్యమాన్నే చేస్తున్న తరుణంలో.. దేశ నిర్మాతల్లో ఒకరైన తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఖ్యాతిని కనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతోంది. నెహ్రూ దేశానిక నష్టం చేశారు. ఆయన కారణంగానే దేశం నాశనమైంది అనే ప్రచారం ఊపందుకుంది. ఇది ఆందోళన కరమైన విషయం. వాసత్వ సంపదను పరిరక్షించుకుంటున్న మనం.. గత పాలకులు చేసిన మంచిని మాత్రం ప్రచారం చేసుకోలేకపోవడం ఆందోళన కలిగించే విషయమే. దేశ నిర్మాణంలో నెహ్రూ పాత్ర కాదనలేనిది. అనేక ఆధునిక దేవాలయాలు ఆయన హయంలోనే నిర్మితమయ్యాయి.. వాస్తవాలను దేశ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Jawaharlal Nehru
Jawaharlal Nehru

అత్యున్నత విద్య అందుబాటులోకి..
నేడు ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రముఖ కంపెనీలకు భారతీయులు సీఈవోలుగా ఉన్నారు. వీరంతా నెహ్రూ ఒక ఉన్నతమైన విజన్‌తో స్థాపించిన విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించినవారే. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) 1950లోనే నెహ్రూ స్థాపించారు. 1960 ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెన్స్‌(ఎయిమ్స్‌) 1961 ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) ఏర్పాటయింది. ప్రపంచంలో పోటీపడగల విద్యాసంస్థలు ఇవి. నెహ్రూ ముందుచూపుతో వీటిని స్థాపించారు. ఆయన కృషి ఫలితంగానే ఆయా విద్యాసంస్థల్లో చదివిన గుగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్, పరాగ్‌ అగర్వాల్‌ ట్విట్టర్‌ సీఈవో, ఇంద్రనూయి పెప్సికోల సీఈవో, అరవింద్‌ కృష్ణ, చైర్మన్‌ అండ్‌ సీఈవో ఆఫ్‌ ఐబీఎంగా ఉన్నత విద్యాసంస్థల్లో చదివి అత్యున్నత హోదాల్లో ఉన్నారు. కేంద్రీయ విద్యాలయాలు కూడా నెహ్రూ స్థాపించినవే.

Also Read: Ambati Rambabu: అంబటి రాంబాబును తగులుకున్న జనసేన

పరిశోధనలకు ప్రధాన్యం..
నేషనల్‌ కెమికల్‌ ల్యాబరేటరీస్‌ 1950లో స్థాపించారు.
– బాబా ఆటమిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌(బార్క్‌) 1954లో స్థాపన జరిగింది. ఇక్కడ జరిపిన పరిశోధనల ఫలితంగానే భారత దేశం నేడు అన్వస్త్రాలు కలిగిన ప్రపంచ దేశాల సరసన నిలిచింది. 1974 ఫోక్రాన్‌ –1, 1998లో ఫోక్రాన్‌ –2 జరిగింది. అలాగే అనువిద్యుత్‌ ఉత్పతికి బాటలు వేసిన అణుశాస్త్ర పరిశోధన బార్క్‌ స్థాపనలో ఊపందుకుంది. అనుశాస్త్రరంగంలో అనేక విజయాలకు పరిశోధనలు బాటలు వేశాయి.
– విక్రంసారాబాయి స్పేస్‌ సెంటర్‌ 1961లో స్థాపించారు. దీంతో రోదసీ విజ్ఞానానికి నెహ్రూ బాటలు వేశారు. ఉపగ్రహ వాహక నౌకలు, ఇన్‌షాట్‌ ఉపగ్రహాలు, పీఎస్‌ఎల్వీలు, జీఎస్‌ఎల్వీలు, నిఘా ఉపగ్రహాలు ప్రయోగించుకునే స్థాయికి ఎదగడానికి కారణం నెహ్రూ అని చెప్పక తప్పదు. ఆయన కృషి, పరిశోధనల ఫలితంగానే మనం రోదసీరంగంలోనూ అగ్రగామిగా నిలిచాం.

– నేషనల్‌ జీయో పిజికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(ఎన్‌జీఆర్‌ఐ)ని 1961లో నెహ్రూ స్థాపించారు. ఇక్కడ జరిపిన భూభౌతిక పరిశోధనల కారణంగానే దేశంలో హరితం విప్లవం జరిగింది. పంటలు అభివృద్ధి చెందాయి. గోధుమలను దిగుమతి చేసుకునే దేశం నేడు ఎగుమతి చేసే స్థాయికి ఎదగడానికికారణం ఎనజీఆర్‌ఐ.

రక్షణరంగంలోనూ..
ఒక్క అనుశాస్త్రం, వ్యవసాయం, రోదసీ రంగంలోనే కాదు రక్షణ రంగానికీ నెహ్రూ పునాదులు వేశారు. రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలు తయారు చేయడానికి డీఆర్డీవో, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ నెహ్రూ స్థాపించినవే. నేడు అగగ్నిలాంటి అత్యాధునిక క్షిపుణులు తయారీకి డీఆర్డీవో పరిశోధనలే మూలం.

నిష్ణాతులను గుర్తించి..
నెహ్రూ దేశ అభివృద్ధికి అవసరమైన రంగాలను గుర్తించి.. ఆయా రంగాల్లో నిష్ణాలుతను గుర్తించి వారికి బాధ్యతలు ఇచ్చి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం ఇచ్చారు. అభివృద్ధికి పూర్తి స్వేచ్ఛ కల్పించారు. దీంతో రోదసీ రంగంలో విక్రం సారాబాయి, ఎస్‌ఎస్‌.బట్నాగర్, భగవంతం, వర్గీస్‌ కురియన్, సీడీ.దేశ్‌ముఖ్‌ ఇలా అనేకమంది శాస్త్రవేత్తలు దేశ శాస్త్రసాంకేతిక అభివృద్ధికి కృషి చేశారు. అమూల్‌ సంస్థ, హరితవిప్లవం కూడా నెహ్రూకాలంలో వేసిన బీజాలే.

పారిశ్రామికాభివృద్ధికి పునాది..
దేశం పారిశ్రామిక అభివృద్ధికి రెండో పంచవర్ష ప్రణాళికలో అధిక ప్రాధాన్యం ఇచ్చారు నెహ్రూ. ఆయన కృషి ఫలితంగానే స్టీల, ఆయిల్, గ్యాస్‌ లాంటి అనేక సంస్థలు ఏర్పడ్డాయి.

– ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ) 1956లో స్థాపించారు. ఇవాళ్ల ఈ సంస్థ దేశంలో ఇంధనరంగంలో మహోన్నత కృషి చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు పెడుతోంది.

Jawaharlal Nehru
Jawaharlal Nehru

– ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌.. 1959లో ఏర్పడింది. 2014లో ఫార్చూన్‌ ప్రకటించిన 100 టాప్‌ కంపెనీల్లో స్థానం సాధించింది.

– ఎల్‌ఐసీ.. బీమారంగంలో ఒక విప్లవం. ప్రపంచంలోనే ఈస్థాయి కంపెనీ లేదు. 40 కోట్ల మందికి బీమా కల్పించింది ఎల్‌ఐసీ. ప్రపంచంలోని టాప్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు కూడా ఇప్పటికీ ఎల్‌ఐసీతో పోటీ పడలేకపోతున్నాయి. ప్రజలకు బీమా కల్పించాలన్న సంకల్పంతో నెహ్రూ ఎలఐసీ స్థాపించారు. సాగునీటి ప్రాజెక్టులను నెహ్రూ ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించారు. అంటే సాగునీటి ప్రాజెక్టులతో భవిష్యత్‌ ప్రాధాన్యత ఆయన అప్పుడే గుర్తించారు.

సాగునీటి ప్రాజెక్టులు..
దేశంలోని జీవనదుల్లో వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి సాగు, తాగునీటి కష్టాలు తీర్చాలన్న సంకల్పంతో నెహ్రూ అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టులు ఆయన హయాంలోనే నిర్మితమయ్యాయి.

– హీరాకుడ్‌ ప్రాజెక్టు దేశంలోనే పొడవైన ప్రాజెక్టు.. 1947లో నిర్మాణం మొదలై 1957లోనే పూర్తిచేశారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు నెహ్రూ పునాది వేశారు. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు బాక్రానంగల్‌ ప్రాజెక్టు 1948లో నెహ్రూ పునాది వేశారు. 1963లో నిర్మాణం పూర్తయింది.

ఇలా అనేక సంస్థలకు నెహ్రూ పునాదివేశారు. కొన్ని ఆయన హయాంలోనే పునాదులు పడ్డాయి. దేశ అభివృద్ధిలో ఈ ఆధునిక దేవాలయాలు కీలయమయ్యాయి. దేశం సాధించిన గొప్పదనానికి కారణమయ్యాయి. కానీ వీటిని విస్మరించడం సరికాదు. నెహ్రూ కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. కానీ రాజకీయ కారణాలతో ఒక నాయకుడు చేసిన మంచి పనులను విస్మరించడం మాత్రం సరికాదు. ఆయన చరిత్రను కనుమరుగు చేయడాన్ని చరిత్ర క్షమించదు.

Also Read:Munugode Bypoll TRS- BJP: మునుగోడులో టీఆర్ఎస్ కు షాక్.. బీజేపీ దూకుడు

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular