https://oktelugu.com/

చంద్రబాబు ఆర్థికమూలాలు దెబ్బతీసే జగన్ ‘అమూల్‌’ ప్లాన్?

ప్రైవేట్‌ డెయిరీలకు చెక్‌పెట్టి.. సహకార డెయిరీలను నిర్వీర్యం చేసేలా ఏపీలో పాగా వేసేందుకు ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ ‘అమూల్‌’ రంగం సిద్ధమైంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం కూడా ఈ సంస్థకు వత్తాసు పలుకుతున్నట్లుగా తెలుస్తోంది. పాడి రైతుకు లీటరుకు రూ.4 బోనస్‌ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని మరిచి, అమూల్‌ పాలు కొంటే అదనపు లాభం వస్తుందని సెలవిస్తోంది. మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్ ఇందులో భాగంగా అమూల్‌, ఏపీ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 5, 2020 12:42 pm
    Follow us on

    CM Jagan Amul Dairy

    ప్రైవేట్‌ డెయిరీలకు చెక్‌పెట్టి.. సహకార డెయిరీలను నిర్వీర్యం చేసేలా ఏపీలో పాగా వేసేందుకు ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ ‘అమూల్‌’ రంగం సిద్ధమైంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం కూడా ఈ సంస్థకు వత్తాసు పలుకుతున్నట్లుగా తెలుస్తోంది. పాడి రైతుకు లీటరుకు రూ.4 బోనస్‌ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని మరిచి, అమూల్‌ పాలు కొంటే అదనపు లాభం వస్తుందని సెలవిస్తోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    ఇందులో భాగంగా అమూల్‌, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్‌ మధ్య ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో పాల సేకరణకు యంత్రాంగమే లేని అమూల్‌కు రైతు భరోసా కేంద్రాల ద్వారా పాలు సేకరించి ఇవ్వనుంది. ఈ ప్రాజెక్టు అమలు కోసం ఇప్పటికే జిల్లాకో ప్రత్యేక అధికారిని నియమించడంతోపాటు జిల్లాస్థాయి కమిటీలనూ వేసింది. తొలిదశలో సీఎం సొంత జిల్లా కడపతోపాటు పాల ఉత్పత్తి అధికంగా ఉన్న చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై అమూల్‌, పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ దృష్టి పెట్టాయి.

    Also Read: అచ్చెన్న దూకుడుకు లోకేష్‌ బ్రేకులు

    అంతేకాదు.. మరో 15రోజుల్లో ఆయా జిల్లాల్లో పాల సేకరణ ప్రారంభించేందుకు రెడీ అవుతోందట. పాల సేకరణలో అమూల్‌ పాగా వేస్తే, తమ డెయిరీలు మూతపడతాయని ప్రైవేటు డెయిరీల యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. ముఖ్యంగా ఇదే వ్యాపారంలో ఉండి రైతుల నుంచి చీప్ గా పాలు కొంటున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు కు చెందిన హెరిటేజ్ కు ఇది పెద్దదెబ్బగా అభివర్ణిస్తున్నారు. చంద్రబాబు ఆర్థికమూలాలు దెబ్బతీసేందుకే జగన్ ఈ స్కెచ్ గీస్తున్నట్లు తెలుస్తోంది.

    అమూల్‌ రాకతో రాష్ట్రంలోని 7 ప్రైవేటు, 13 సహకార డెయిరీల మనుగడ కష్టమేనని వ్యాపారులు చెబుతున్నారు. అమూల్‌తో ఒప్పందం అమలుపై పశుసంవర్థక శాఖ మంత్రి అప్పలరాజు సమీక్షించగా.. రైతు భరోసా కేంద్రాల్లో పాలు సేకరించి, అమూల్‌కు అప్పగించాలని పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ అధికారులను ఆదేశించారు. తొలి విడతలో చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో పాల సేకరణ చేపట్టి, దశలవారీగా మిగిలిన జిల్లాల్లోనూ అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు.

    Also Read: ముద్రగడ ఎందుకు సైలెంట్‌ అయ్యారు..!

    పాల ఉత్పత్తిదారులు మహిళలతో కొత్తగా పాల సహకార సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. పాల నాణ్యతను బట్టి ఉత్పత్తిదారులకు ధర వస్తుందని, కొలతలో తేడాలు రానీయొద్దని స్పష్టం చేశారు. కాగా, విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ పాడిపశువులకు గ్రామస్థాయిలో సత్వర వైద్యసేవలు అందించాలన్నారు. మెగా పశువైద్య శిబిరాలు, రాజన్న పశువైద్యం, ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌లను మరింత అందుబాటులోకి తేవాలని, వెబినార్‌ల ద్వారా పశువైద్య నిపుణుల సలహాలు తీసుకోవాలన్నారు.  ఓ ప్రైవేటు డెయిరీలు వ్యతిరేకిస్తున్న అమూల్‌ను సీఎం జగన్‌ రాష్ట్రంలో ఎలా అడుగుపెట్టనిస్తారో చూడాలి మరి.