Amravati farmers: ఏపీలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకే వేదికమీద కనిపించాయి. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇలా ఒకే వేదికమీద కనిపించడం ఇదే మొదటిసారి. అమరావతి రైతులు నిర్వహిస్తున్న న్యాయస్థానం నంచి దేవస్థానం వరకు అనే మహాపాదయాత్ర ముగింపు సభ సందర్భంగా ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. రైతులకు మద్దతుగా వైసీపీ తప్ప మిగతా అన్ని పార్టీలు హాజరయ్యాయి. ఆయా పార్టీల తరఫున ప్రతినిధులు హాజరై సంఘీభావం తెలిపారు.
తిరుపతిలో రైతులు నిర్వహించిన ఈ సభలో అందరూ పచ్చ జెండాలు, పచ్చ టోపీలతో కనిపించారు. పార్టీల జెండాలను పక్కన పెట్టి అందరూ ఇవే ఆకుపచ్చ జెండాలను పట్టుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఇక జనసేన తరఫున రామదాసు చౌదరి హాజరయ్యారు. ఇక వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు కూడా ఈ సభలో పాల్గొనడం ఇక్కడ గమనార్హం.
ఇక వీరితో పాటు మాజీ మంత్రి పరిటాల సునీత, వర్ల రామయ్య, సీపీఐ నేత నారాయణ, శ్రావణ్ కుమార్, సినీ నటుడు శివాజీ పాల్గొన్నారు. వీరందరూ ఒకే వేదిక మీద నిలబడి రైతులుకు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ప్రకటించారు. ఇక రైతులు చాలామంది భావోద్వేగానికి గురయ్యారు. వ్యవసాయం చేసుకునే తమను రోడ్డున పడేశారంటూ కన్నీరు పెట్టుకున్నారు. కొందరి మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టారంటూ ఆవేదన చెందారు.
Also Read: Amaravathi: అమరావతి ఒక్కటే రాజధాని.. చంద్రబాబుతో కాదు.. జగన్ కానీయడు.. మరెట్లా?
ఇక మహిళలు మాట్లాడుతూ వందల రోజులుగా నిరసనలు చేస్తున్నా తమను ఎవరూ పట్టించు కోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ సభకు వచ్చిన చంద్రబాబు నాయుడు జగన్ సర్కార్ తో పోరాడి రైతులను గెలిపిస్తామని ప్రకటించారు. ఇక వపన్ కల్యాణ్ కూడా రైతులకు పూర్తి మద్దతు తెలిపినట్టు ఆ పార్టీ తరఫున వచ్చిన రామదాసు చౌదరి ప్రకటించారు. ఇతర పార్టీల నేతలు కూడా రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.