
Amith Shah : బీజేపీలో నంబర్ 2.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణకు వస్తున్నారు. వికారాబాద్ జిల్లా చేవెళ్లలోని కేవీఆర్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో కేంద్ర మంత్రి పాల్గొంటారు. ఈ బహిరంగ సభ కారణంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు విధించనున్నారు.
– హైదరాబాద్ నుంచి చేవెళ్ల, వికారాబాద్ వైపు వచ్చే భారీ వాహనాలను టిప్పుకాన్ వంతెన వద్ద నార్సింగి–శంకరపల్లి–పర్వేద ఎక్స్‌రోడ్డు–ఆలూరు–వికారాబాద్ వైపు మళ్లిస్తారు.
– హైదరాబాద్ నుంచి మొయినాబాద్, చేవెళ్ల, వికారాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను రోటరీ–1 టీఎస్‌పీఏ వద్ద సర్వీస్ రోడ్డు–నార్సింగి–జన్వాడ–శంకర్‌పల్లి–పర్వేద ఎక్స్ రోడ్డు–వికారాబాద్ వైపు మళ్లిస్తారు.
– శంషాబాద్, రాజేంద్రనగర్ నుంచి ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నెం: 18లో వికారాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్ ఎగ్జిట్ నెం: 1 సర్వీస్ రోడ్ – మూవీ టవర్ కొత్త రోడ్ –సీబీఐటీ టీ జంక్షన్ – శంకర్‌పల్లి – పర్వేద ఎక్స్ రోడ్ – ఆలూర్ – వికారాబాద్‌గా మళ్లించనున్నారు.
– శంషాబాద్, రాజేంద్రనగర్ నుంచి ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నెం: 18 మీదుగా చేవెళ్ల వైపు వచ్చే భారీ వాహనాలు ఎగ్జిట్ నెం: 1 సర్వీస్ రోడ్ – మూవీ టవర్ కొత్త రోడ్డు – íసీబీఐటీ టీ జంక్షన్ – శంకర్‌పల్లి – యెంకీపల్లి ఎక్స్ రోడ్ – చేవెళ్ల మీదుగా మళ్లిస్తారు.
– టీఎస్‌పీఏ నుంచి చేవెళ్ల, వికారాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్ ఎక్స్ రోడ్డు– ప్రగతి రిసార్ట్స్– యెంకేపల్లి ఎక్స్ రోడ్డు– ఆలూర్ ఎక్స్ రోడ్డు– వికారాబాద్ వైపు మళ్లిస్తారు.
– టీఎస్‌పీఏ నుంచి చేవెళ్ల, వికారాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్ ఎక్స్ రోడ్డు– ప్రగతి రిసార్ట్స్– యెంకేపల్లి ఎక్స్ రోడ్డు– చేవెళ్ల వైపు మళ్లిస్తారు. టీఎస్‌పీఏ నుంచి మొయినాబాద్, చేవెళ్ల, వికారాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్ ఎక్స్‌రోడ్–ప్రగతి రిసార్ట్స్–యెంకేపల్లి ఎక్స్ రోడ్–శంకరపల్లి వైపు మళ్లిస్తారు.
భారీగా ఏర్పాట్లు..
ఇదిలా ఉండగా చేవెళ్ల సభ కోసం బీజేపీ నాయకులు భారీగా ఏర్పాట్లు చేశారు. అమిత్‌షా ప్రయాణించే దారి పొడవునా కాషాయ జెండాలు, ఫ్లెక్సీలు కటౌట్లు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలోనూ భారీ కౌటట్లు పెట్టారు. సభ ఏర్పాట్లను ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి దగ్గరుండి చూస్తున్నారు.
పొంగులేటి.. జూపల్లి చేరికపై ఉత్కంఠ..
ఇదిలా ఉండగా చేవెళ్ల సభలో ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి, కొల్హాపూర్ మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు చేరికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈమేరకు చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఆ ఇద్దరితో మంతనాలు జరుపుతున్నారు. అయితే పొంగులేటి పెట్టే శరతులతో కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు అధిష్టానంతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో ముందస్తు హామీలపై స్పష్టత లేకపోవడంతో పొంగులేటి, జూపల్లి చేరికపై క్లారిటీ రావడం లేదు.