Amit Shah: తమిళి సై కి అమిత్ షా క్లాస్.. వీడియో వైరల్

తమిళ సై సౌందరరాజన్ మాట్లాడిన మాటలతో అన్నామలై కలత చెందినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన తన రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 12, 2024 1:47 pm

Amit Shah

Follow us on

Amit Shah: ఇటీవల ఎన్నికల ఫలితాలలో దక్షిణాది రాష్ట్రాలలో తమిళనాడు మినహా మిగతా ప్రాంతాలలో బిజెపి సత్తా చాటింది. చివరికి కేరళ రాష్ట్రంలోనూ ఎంపీ స్థానం గెలిచి అదరగొట్టింది. కానీ, తమిళనాడు రాష్ట్రంలో మాత్రం ఖాతా తెరవలేకపోయింది. ఇది బిజెపి అధినాయకత్వానికి ఇబ్బందికరంగా పరిణమించింది.. తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వినూత్నంగా ప్రచారం చేసినప్పటికీ, పాదయాత్ర చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి ఆయన కోయంబత్తూర్ పార్లమెంటు స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. సీట్లు గెలుచుకోలేక పోయినప్పటికీ, ఓటు బ్యాంకు ను మాత్రం పెంచుకుంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో బిజెపి దారుణ ఓటమిపై మాజీ గవర్నర్, బిజెపి అభ్యర్థి తమిళిఫై సౌందర రాజన్ స్పందించారు.. అన్నామలై పై తీవ్ర ఆరోపణలు చేశారు.. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. బిజెపి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్రమంలో ఆమె మాట్లాడిన మాటలు అక్కడి అధికార డీఎంకే పార్టీకి ఆయాచిత వరం లాగా మారాయి.

తమిళ సై సౌందరరాజన్ మాట్లాడిన మాటలతో అన్నామలై కలత చెందినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన తన రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇది బిజెపి అధిష్టానానికి తెలియడంతో రంగంలోకి అమిత్ షా దిగారు. అన్నామలై తో ఫోన్లో మాట్లాడారు. “మీరు గొప్ప ప్రయత్నం చేశారు. ఇలాగే సాగిపోతే పెద్దగా ఇబ్బంది ఉండదు. భవిష్యత్తు కాలం మనదే. ఎవరో ఏదో అన్నారని మీరు కలత చెందాల్సిన అవసరం లేదు. మీరు వేసే ప్రతి అడుగు వెనుక మా సంకల్పం ఉంటుంది. మీరు చేసే ప్రతి పనికి మా సపోర్ట్ ఉంటుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.. రాజకీయాలలో ఇవన్నీ సర్వసాధారణం. మీరు మీ పని మీద దృష్టి సారించండి. అంతిమంగా విజయాలు అవే వస్తాయి. మీరు కష్టపడే తత్వం కలిగిన వారు. ఇలాంటి వ్యక్తులు వెనుకంజ వేయకూడదు. అపజయాలు ఎదురైనప్పుడే విజయాల లభిస్తాయని” అమిత్ షా అనునయించారు.

తమిళసై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బిజెపి అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్టు తమిళ మీడియా ఇటీవల వరుస కథనాలు ప్రచురించింది. ఈ క్రమంలో తమిళసైకి అమిత్ షా క్లాస్ పీకినట్టు తెలుస్తోంది.. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ సై కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదిక మీద వచ్చిన ఆమెను అమిత్ షా దగ్గరికి పిలిపించుకున్నారు. అందరి ముందే మందలించారు. ఆమె వివరణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ వినలేదు. షా మాట్లాడుతున్న సమయంలో పక్కనే వెంకయ్య నాయుడు కూడా ఉన్నారు..”పార్టీలో ఎన్నో ఉంటాయి. అవన్నీ బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చేయాలో అధిష్టానానికి తెలుసు. మీరు అనవసరంగా మాట్లాడొద్దు. అది పార్టీకి నష్టం చేకూర్చుతుంది. దయచేసి ఇలాంటి సంఘటనలను పునరావృతం కానీయకండి” అంటూ అమిత్ షా తమిళసైతో వ్యాఖ్యానించినట్టు మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.