Hair Health: జుట్టు ఆరోగ్యం కోసం సింపుల్ టిప్స్ ఎలాంటి పదార్థాలు అవసరం లేదు

తలలో దువ్వెన పెట్టి దూయడమే పెద్ద టాస్క్ గా పరిగణిస్తున్నారు నేటి యువత. సమయం ఉండదు కాబట్టి ఓ కొప్పు కట్టేసి ఉద్యోగాలకు, పనులకు వెళ్తున్నారు. కానీ జుట్టుకు మసాజ్ చాలా అవసరం.దీని వల్ల జుట్టు బలంగా మారుతుంది.

Written By: Swathi, Updated On : June 12, 2024 1:52 pm

Hair Health

Follow us on

Hair Health: జుట్టు పెరగాలంటే చాలా కష్టం. ఈ రోజుల్లో పొడవాటి జుట్టు, ఒత్తు జుట్టు ఉండటం కూడా తక్కువే. చాలా మంది జుట్టు పెంచుకోవాలి అనుకున్నా కుదరడం లేదు. దీనికి కారణం వాతావరణంలో పెరిగిన కాలుష్యం. దీనికి తోడు జీవన శైలిలో మార్పులు కూడా ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. మరి సహజమైన పద్దతిలో జుట్టు పెరగాలంటే ఏం చేయాలో తెలుసా?

తలలో దువ్వెన పెట్టి దూయడమే పెద్ద టాస్క్ గా పరిగణిస్తున్నారు నేటి యువత. సమయం ఉండదు కాబట్టి ఓ కొప్పు కట్టేసి ఉద్యోగాలకు, పనులకు వెళ్తున్నారు. కానీ జుట్టుకు మసాజ్ చాలా అవసరం.దీని వల్ల జుట్టు బలంగా మారుతుంది. మసాజ్ చేయడం వల్ల తల నరాలు యాక్టివ్ అవుతుంది. దీని వల్ల స్కాల్ఫ్ రిలాక్స్ అవుతుంది. తద్వారా రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. జుట్టు చిట్లుతుంటే క్రమం తప్పకుండా ట్రిమ్ చేస్తూ ఉండాలి. లేదంటే వీటి వల్ల జుట్టు పెరగదు. సో జాగ్రత్త.

వేడి వేడి నీటితో తలస్నానం చేస్తే జుట్టు కుదుళ్ళు బలహీనం అవుతాయి. కానీ జుట్టుకు ఆవిరి పడితే చాలు. మంచి మసాజ్ లా మారి.. స్కాల్ఫ్లోని రంధ్రాలు తెరుచుకుంటాయి. నూనెను కూడా బాగా తీసుకుంటుంది. దీని వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. మరో విధానం ఏంటంటే..కండిషనింగ్. దీని వల్ల కూడా జుట్టు రాలదు. క్రమం తప్పకుండా కండిషనింగ్ చేసుకోవాలి. బ్లో డ్రైయర్, స్ట్రయిటినింగ్ కర్లింగ్ వంటి వాటివల్ల జుట్టు పాడవుతుంది. ఇది జుట్టు రాలడం, నిర్జీవంగా మారడానికి కారణం అవుతాయి ఈ పరికరాలు.

జుట్టు పెరగడానికి ప్రోటీన్, విటమిన్స్ అవసరం. శరీరంలో A,C,D,E బయోటిన్ వంటి విటమిన్లు లోపిస్తే జుట్టు పెరగదు. సో జాగ్రత్త. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారిలో చెమట ఎక్కువ వస్తుంది. అందుకే జుట్టుకు షాంపూ ఉపయోగిస్తుండాలి. కనీసం వారానికి రెండుసార్లు జుట్టుకు షాంపూ పట్టిస్తే మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.