KCR: తెలంగాణలో బీజేపీ మార్పులు చేసుకుంటోంది. రాజకీయంగా టీఆర్ఎస్ నుంచి విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని తిప్పి కొట్టేందుకు వ్యూహాలు ఖరారు చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించారు. ధాన్యం కొనుగోలును రాజకీయం చేస్తూ కేంద్రాన్ని అప్రదిష్టపాలు చేయాలని గులాబీ పార్టీ భావిస్తున్న తరుణంలో దాని ఆలోచనలను ఎదుర్కోవాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ కు అమిత్ షా కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. బండి సంజయ్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి. దీంతో అందరు ఢిల్లీ పయనమవుతున్నారు.

రాష్ర్టంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తోంది. ధాన్యం కొనుగోలును సాకుగా చూపుతూ బీజేపీని అభాసుపాలు చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగానే పార్లమెంట్ వేదికగా ఎంపీలు కేంద్రాన్ని నిలదీసిన సంగతి తెలిసిందే. మరోవైపు టీఆర్ఎస్ ఎంపీలతో రాజీనామాలు చేయించాలని భావించిని వ్యతిరేకత వస్తే ఎలా అనే ఆలోచనలో పడిపోయినట్లు తెలుస్తోంది.
అమిత్ షాతో భేటీలో పలు విషయాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. రాష్ర్టంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు పార్టీలో సముచిత ప్రాధాన్యం ఇచ్చేందుకు నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీలో కొత్తవారిని చేర్చుకునేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో రాష్ర్ట పరిస్థితులపై అమిత్ షా దిశా నిర్దేశం చేయనున్నట్లు భావిస్తున్నారు.
Also Read: Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్న నోరు మూతపడ్డట్టేనా?
గురువారం జరగబోయే భేటీపై అందరిలో అంచనాలు పెరుగుతున్నాయి. రాష్ర్టంపై బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ర్టంలో బీజేపీకి వస్తున్న ఊపుతో మంచి ఫలితాలు సాధించాలనే తపనతో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీకి తెలంగాణలో మంచి భవిష్యత్ ఉన్న దృష్ట్యా సద్వినియోగం చేసుకుని అధికారం చేపట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ బీజేపీని రాష్ర్టంలో నిలదొక్కుకోనివ్వకుండా చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు పార్టీవర్గాల్లో చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని భావించే ఇలా పార్టీని అడ్డుకోవాలనే ఉద్దేశంతో రకరకాల ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసమే ధాన్యం కొనుగోలు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి లబ్ధి పొందాలను భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: Modi Formers: మోడీ ప్రభుత్వం ఎన్నికల కోసం రైతుల ముందు మోకరిల్లిందా?