Joe Biden: అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడిగా పని చేసిన డోనాల్డ్ ట్రంప్ గతంలో అనుచితంగా ప్రవర్తించిన సంగతి అందరికీ విదితమే. కాగా, ఆ తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ మాత్రం ఆయనతో పోలిస్తే కొంత హుందాగానే ప్రవర్తిస్తున్నారు. ఆయన హుందాగానే ఉంటారని అందరూ అనుకున్నారు కూడా. కానీ, తాజాగా జో బైడెన్ సైతం అసహనం వ్యక్తం చేశారు. పాత్రికేయుడిని బూతులు తిట్టి తనకు ఎమోషన్స్ ఉంటాయని నిరూపించుకున్నాడు.

మీడియా సమక్షంలోనే అగ్రరాజ్యాధినేత జో బై డెన్ అలా అసహనం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ మరణాల విషయంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో..ఓ జర్నలిస్టు కాస్త ఇబ్బందికర ప్రశ్నను జో బైడెన్‌కు సంధించాడు. దాంతో జో బైడెన్ ఆ పాత్రికేయుడిని ఉద్దేశించి దూషించాడు. అయితే, అది బయటకు చెప్పకపోయినప్పటికీ లో లోపల మాట్లాడుతున్న క్రమంలో అది మైక్ లో రికార్డు అయి అది అందరికీ వినిపించింది కూడా. దాంతో ఆ పదం విన్న జర్నలిస్టులు నివ్వెర పోయారు.
నిజానికి జో బైడెన్ తన ప్రెస్ మీట్‌లో ధరల నియంత్రణపై, రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని నివారించడానికి అమెరికా తీసుకున్న చర్యలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలను వివరించడానికి ప్రయ్నతిస్తున్నారు. అందుకే జో బైడెన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను ఆయన మీడియా ముఖంగా తెలిపాల్సి ఉంది. అలా తన అధికారిక నివాసం వైట్‌హౌస్‌లోని ఈస్ట్ రూమ్‌లో ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు.
Also Read: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏడాది పాలన ఎలా సాగిందంటే?
దాంతో ఈ ప్రెస్ మీట్ కవరేజీ నిమిత్తం వైట్‌హౌస్ కార్యకలాపాలను కవర్ చేసే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రెస్ మీట్‌కు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ప్రెస్ కాన్ఫరెన్స్ దాదాపుగా ముగింపు దశకు వచ్చిన సమయంలో ఫాక్స్ చానల్ కరెస్పాండెంట్ పీటర్ డూసీ అడిగిన ప్రశ్నకు జో బైడెన్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆ అసహనం తాను దాచుకునే ప్రయత్నం చేశారు. కానీ, దాన్ని దాచుకోలేకపోయారు బైడెన్. ద్రవ్యోల్బణం మీద తానొకక ప్రశ్నను అడగబోతున్నానని సదరు మీడియా ప్రతినిధి ప్రశ్న మొదలు పెట్టారు. ఈ మధ్యంతర కాలంలో ద్రవ్యోల్బణం ఏర్పడటానికి రాజకీయ స్థితిగతులు బాధ్యత వహించాల్సి ఉంటుందని భావిస్తున్నారా? అని సూటిగానే క్వశ్చన్ అడిగారు. దానికి బైడెన్ దూషిస్తూనే, అదో అదో గొప్ప ఆస్తి అని వ్యాఖ్యానించారు. బైడెన్ వాట్ వాట్ ఎ స్టుపిడ్ సన్ ఆఫ్ బిచ్ అని జర్నలిస్టును దూషించాడు. అది విని మీడియా ప్రతినిధులు నివ్వెరపోయారు.
Also Read: 1973 తరువాత యూరప్ లో అతిపెద్ద సంక్షోభం.. రష్యానే కారణమా?
[…] Also Read: లైవ్‌లో జర్నలిస్టును బూతులు తిట్టిన … […]
[…] Read: లైవ్‌లో జర్నలిస్టును బూతులు తిట్టిన … యూపీలో మహిళా, శిశు సంక్షేమ శాఖ […]