Homeఅంతర్జాతీయంEl Nino 2027 Drought Forecast: యుద్ధం ముగిసిందనుకుంటే.. మరో ఉపద్రవం.. వచ్చే ఏడాది వరకు...

El Nino 2027 Drought Forecast: యుద్ధం ముగిసిందనుకుంటే.. మరో ఉపద్రవం.. వచ్చే ఏడాది వరకు కష్టమే

El Nino 2027 Drought Forecast: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నిన్నటిదాకా భీకరమైన యుద్ధం జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందం ద్వారా ఆ యుద్ధం తాత్కాలికంగా వాయిదా పడింది. యుద్ధం వల్ల జరిగే దాడులు విపరీతమైన కాలుష్యానికి కారణమవుతుంటాయి. కాలుష్యం వల్ల వాతావరణంలో అనేక రకాలుగా మార్పులు చోటుచేసుకుంటాయి. వాటి వల్ల కరువు కాటకాలు ఏర్పడుతుంటాయి.

ఉదాహరణకు రెండవ ప్రపంచ యుద్ధాన్ని తీసుకుంటే.. నాడు అమెరికా వేసిన న్యూక్లియర్ బాంబు వల్ల జపాన్ తీవ్రంగా నష్టపోయింది. ఆ బాంబు వేసిన ప్రాంతంలో ఇప్పటికీ పచ్చ గడ్డి కూడా మొలవడం లేదు. దీనిని బట్టి యుద్ధం లాంటి వైపరీత్యాలు చోటు చేసుకున్నప్పుడు ప్రకృతి ఎంత ప్రభావితమవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక యుద్ధం తాత్కాలికంగా ముగిసింది అనుకుంటే.. మరో ఉపద్రవం ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతోంది. ఈసారి ప్రపంచాన్ని ఆ విధంగా కలవరపెడుతున్న అంశం యుద్ధం కాదు.. మరొకటి కాదు.. అది కరువు.

ఈ కరువు ఏర్పడేందుకు ప్రధాన కారణం పసిఫిక్ మహాసముద్రం. కొంతకాలంగా పసిఫిక్ మహాసముద్రం వేడెక్కుతోంది. దీనివల్ల ఎల్ నినో ఏర్పడుతోంది. ఎల్ నినో అనేది పసిఫిక్ సముద్రంలో సాధారణంగా ఏర్పడేదే. అయితే ఈసారి ఏర్పడుతున్న ఎల్ నినో అత్యంత ప్రమాదకరమైనది. దీనివల్ల 2027 వరకు ప్రపంచ వ్యాప్తంగా ఎండలు మండిపోతాయట. చివరికి ధ్రువ ప్రాంతాలలో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతాయట. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశమైన భారత్ లో ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు కురిసే అవకాశం లేదట. దీనివల్ల సాగురంగం పూర్తిగా దెబ్బతింటుందట. మనదేశంలో కరువు పరిస్థితి ఉంటే.. దక్షిణ అమెరికాలో భారీగా వరదలు వస్తాయట. విస్తారమైన వర్షాలు కురిసి ప్రాంతాలకు ప్రాంతాలు మీట మునిగిపోతాయట. సముద్ర తీర ప్రాంతం మరింత ముందుకు దూసుకు వస్తుందట.. తీర ప్రాంతాలు కోతకు గురి అవుతాయట.

మనదేశంలో కరువు అనుకుంటే.. ఆసియా మొత్తం కూడా కరువు వచ్చే అవకాశం ఉంటుందట. వాతావరణ మొత్తం అల్లకల్లోలంగా ఉంటుందట. అందువల్లే ఇప్పటినుంచే ఆయా ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కరువు వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆహార ధాన్యాలకు.. ఇతర తిండి గింజలకు తీవ్రమైన కొరత ఏర్పడుతుంది. ఆ సమయంలో మరణాలు కూడా చోటుచేసుకుంటాయి. ఇవన్నీ జరగకూడదు అనుకుంటే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో సర్వసాధారణంగా ఏర్పడేదే. అయితే ఈసారి అత్యంత తీవ్రమైన ఎల్ నినో ఏర్పడడం వల్ల కరువు కాటకాలు అధికంగా వస్తాయట.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version