Homeక్రీడలుక్రికెట్‌Mohammad Shami Struggles 2026: షమీ నోట.. కూలీ మాట.. ఇంతటి ఆవేదన ఉందా..

Mohammad Shami Struggles 2026: షమీ నోట.. కూలీ మాట.. ఇంతటి ఆవేదన ఉందా..

Mohammad Shami Struggles 2026: క్రికెటర్లను మనదేశంలో సెలబ్రిటీలుగా భావిస్తుంటారు. కొన్ని ప్రాంతాలలో డెమీ గాడ్స్ గా అభివర్ణిస్తుంటారు. కానీ.. క్రికెటర్ల వెనుక కూడా విపరీతమైన బాధ ఉంటుంది. క్రికెటర్లు అయినంత మాత్రాన అవకాశాలు పోలోమని రావు. అవకాశాలు వచ్చినప్పటికీ స్థిరంగా ఉండదు. ప్రతిభ ఉన్నప్పటికీ కొంతమంది ఆటగాళ్లకు అవకాశాలు రావడం ఎండమావిలాగా ఉంటుంది.

ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు రాక ఇబ్బంది పడుతున్న ప్లేయర్లలో మహమ్మద్ షమీ ముందు వరుసలో ఉంటాడు. 2023 వరల్డ్ కప్ లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అతడు ఆవిర్భవించాడు. ఆ తర్వాత గాయం కావడంతో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అనంతరం ఇండియాకు తిరిగి వచ్చిన అతడు.. జాతీయ జట్టులో అవకాశం కోసం గత రెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తూనే ఉన్నాడు. డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపిస్తున్నప్పటికీ మేనేజ్మెంట్ అతనికి అవకాశాలు ఇవ్వడం లేదు. ఐపీఎల్ లో కూడా 2025లో హైదరాబాద్ జట్టు తరుపున ఆడిన అతడు.. 2026 సీజన్ విషయానికి వచ్చేసరికి లక్నో జట్టుకు మారిపోయాడు. ఇటీవల హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు కీలకంగా వ్యవహరించాడు. లక్నో జట్టు తరఫున కీలక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు. అంతేకాదు, మ్యాచ్ స్వరూపాన్ని మొత్తం మార్చేశాడు.

లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్ లో గెలిచిన తర్వాత షమీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా క్రికెట్ ఆడే వ్యక్తులను అతడు కూలీలుగా అభివర్ణించడం విశేషం.. “మేము కూలీలమే. బౌలింగ్ చేయడం కూలి కిందికే వస్తుంది. ఆటగాళ్ల జీవితంలో గాయాలు సర్వసాధారణం. ఎత్తు పల్లాలు కూడా అత్యంత సహజం. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు పడే కష్టాన్ని మర్చిపోకూడదు. కుర్రాళ్ళు ఈ విషయాన్ని గమనించాలి. ఫ్యాన్సీ విషయాలు కొద్దిసేపు మాత్రమే ఆనందాన్ని కలిగిస్తాయి. ఆ తర్వాత అవి బలహీనతగా మారిపోతాయని” షమీ వ్యాఖ్యానించాడు.

భార్యతో విడాకులు.. ఇబ్బందికరంగా కెరియర్.. అవకాశాలు రాకపోవడం.. ఇంకా అనేక రకాల ప్రతి కూలతలు ఇబ్బంది పెడుతున్నప్పటికీ షమీ ఏమాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు వెళ్తున్నాడు. గత ఏడాది తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా షమీ భావోద్వేగానికి గురయ్యాడు. తన కుమార్తెను పట్టుకొని ఏడ్చాడు. భరణం ఇచ్చినప్పటికీ.. షమీ మాజీ భార్య అతడిని ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇటు జట్టులో చోటు లభించకపోవడంతో అతడు పడుతున్న బాధ మామూలుగా లేదు. అయినప్పటికీ సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా ఆయన సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకొని.. ఇదిగో ఇలా ముందుకు సాగిపోతున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version