Homeఅంతర్జాతీయంRussia And Ukraine- America: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం లోకి అమెరికా: మూడో ప్రపంచ యుద్ధం...

Russia And Ukraine- America: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం లోకి అమెరికా: మూడో ప్రపంచ యుద్ధం తప్పదా?

Russia And Ukraine- America: ఇప్పుడే కాదు.. అమెరికా కూడా ఆ చైనా టైపే. తన ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తుంది. ఎంతకైనా తెగిస్తుంది.. ఎవరినైనా ఎదిరిస్తుంది.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ పై బాంబులు వేసి ఎంత రచ్చ రచ్చ చేసిందో ప్రపంచానికి తెలుసు..బిల్ క్లింటన్, జార్జ్ బుష్, ఒబామా, ట్రంప్, ఇప్పుడు బైడెన్… అధ్యక్షులు మాత్రమే మారారు. అమెరికా సామ్రాజ్యవాదం మారలేదు. పైగా కొత్త చివుళ్ళు తొడుక్కుంటున్నది.

Russia And Ukraine- America
Russia And Ukraine- America

అ పాచీక పారలేదు

నాటో దేశాల సభ్యత్వంలో చేరేందుకు ఉక్రెయిన్ మొగ్గు చూపుతున్న రోజులవి. బెలారస్ వంటి దేశంపై యుద్ధం చేసి రష్యా గెలిచిన రోజులు కూడా అవే. కానీ వెనుక ఉన్న నాటో దేశాలు ఉక్రెయిన్ ను ఎగదోశాయి. ఈ పన్నాగం తెలియని బెలేన్ స్కీ తాడో పేడో అనే సంకేతాలు ఇచ్చాడు. ఒళ్ళు మండిన పుతిన్ యుద్ధానికి సిద్ధమన్నాడు. అలా ఫిబ్రవరిలో మొదలైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కీలకమైన కీవ్, మరియా పోల్ రష్యా సొంతమయ్యాయి. ఇప్పటికీ భీకరమైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఎంతవరకు దారితీస్తాయో తెలియదు కానీ…పుతిన్ మాత్రం వెనకడుగు వేయడం లేదు. మరోవైపు నాటో దేశాలు కూడా యుద్ధాన్ని విరమించేలా చేయడం లేదు.. దీంతో పరిస్థితి నానాటికి చేయి దాటిపోతున్నది.. ఇదే సమయంలో జపాన్ సరిహద్దుల్లో అటు రష్యా,ఇటు చైనా, ఉత్తర కొరియా దేశాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. దీంతో జపాన్ కూడా శాంతి మంత్రాన్ని పక్కనపెట్టి సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. తన దేశ జీడీపీలో రెండు శాతం ఆయుధాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ పరిస్థితులు మొత్తం చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందేమో అనే భయాలు కలుగుతున్నాయి.

మధ్యలో అమెరికా

ఆ మధ్య అమెరికా ఇరాన్, ఇరాక్ పై యుద్ధాలు చేసింది. ఇందుకు కారణం లేకపోలేదు. ఆ రెండు దేశాల్లో చమరు నిల్వలు విస్తారంగా ఉంటాయి.. వాటిని చవకగా పొందేందుకు అమెరికా అనేక కుయుక్తులు పన్నింది. దీనికి ఆ దేశాలు ఒప్పుకోలేదు. దీంతో అమెరికా ఆదేశాలపై యుద్ధం ప్రకటించింది. తనకు తొత్తులుగా ఉండే వ్యక్తులను దేశ అధ్యక్షులను చేసింది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ముస్లిం దేశాలు అమెరికాను ప్రతిఘటించకపోవడం గమనార్హం. అయితే ప్రస్తుతం అమెరికా లాగానే సమాంతర శక్తిగా రష్యా ఎదుగుతున్నది.. ఇది ఎలాగైనా తనకు ప్రమాదమేనని భావించిన అమెరికా.. ఉక్రెయిన్ అడ్డం పెట్టుకొని యుద్ధం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న అమెరికా… ఇప్పుడు హఠాత్తుగా రంగంలోకి దూకడం వెనక కారణం ఇదే అని విశ్లేషకులు చెబుతున్నారు.. ప్రస్తుతం ప్రపంచం అన్ని రంగాల్లో దూసుకుపోతున్న నేపథ్యంలో… మూడో ప్రపంచ యుద్ధం గనుక వస్తే ఈ భూమి మీద మనిషి మనగడే ఉండదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇటీవల పాకిస్తాన్ మంత్రి మా వద్ద అణు బాంబు ఉందని హెచ్చరించడం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతున్నది.

Russia And Ukraine- America
Russia And Ukraine- America

మరోవైపు ఉక్రెయిన్ తో యుద్ధాన్ని పుతిన్ ఆపే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఒకవేళ యుద్ధాన్ని గనక ఆపితే రష్యా పరువు పోతుంది. అమెరికా లాంటి దేశాలు చులకనగా చూస్తాయి. దీనికి తోడు యూరప్, మధ్య ఆసియా దేశాలపై రష్యా పట్టు తగ్గుతుంది.. మరోవైపు కీలక నగరాలను ఆక్రమిస్తున్న రష్యా బలగాలు…తాము పూర్తిగా ఉక్రెయిన్ ను పూర్తిగా ఆక్రమించుకున్నాకే దేశాన్ని విడిచి వెళ్తామని అంతర్గతంగా చెబుతున్నారు..ఈ పరిస్థితులు మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెడుతున్నాయి. రేపు ఏదైనా జరగరానిది జరిగితే చమరు ధరలు ఆకాశాన్ని అంటుతాయి. అప్పుడు వర్ధమాన దేశాల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది.. బెంజిమెన్ ఫ్రాంక్లిన్ అన్నట్టు మంచి యుద్ధం… చెడ్డ శాంతి ఉండవు.. వీటిని అమెరికా, రష్యా లాంటి దేశాలు ఎంత త్వరగా గుర్తిస్తే ప్రపంచానికి అంత మంచిది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version