America vs China: అగ్రరాజ్యం అమెరికా డ్రాగన్ చర్యలను ఆక్షేపిస్తోంది. యుగుర్ ముస్లింలపై డ్రాగన్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించింది. చైనా ఉత్పత్తులపై ఆంక్షలు విధిస్తోంది. ఇక్కడ తయారయ్యే వస్తువులను తమ దేశానికి దిగుమతి చేసుకునేందుకు నిరాకరిస్తోంది. 11 పరిశోధన సంస్థలను అమెరికా వాణిజ్య శాఖ లక్ష్యంగా చేసుకుంది. దీంతో డ్రాగన్ ను ఏకాకిగా చేస్తోంది. దీని కోసం అన్ని మార్గాలు అన్వేషిస్తోంది. తాజా చర్యతో ఈ సంస్థలకు లైసెన్స్ లేకుండా ఎలాంటి ఆభరణాలు విక్రయించకూడదని చెబుతోంది.

చైనాలో మైనార్టీల అణచివేతను చైనా ప్రోత్సహిస్తోందని అమెరికా చెబుతోంది. బయోమెట్రిక్ ముఖ గుర్తింపు వ్యవస్థతో కూడిన నిఘా సాధనాలు డ్రాగన్ ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగానే చైనా కుట్రలను అమెరికా తిప్పి కొట్టాలని చూస్తోంది. దీనికి గాను పలు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీంతో చైనాలో ఉత్పత్తయ్యే వస్తువలను తమ దేశానికి రాకుండా చేయడానికే నిర్ణయించుకుంటోందని చెబుతున్నారు.
మరోవైపు చైనా బలవంతపు చాకిరీ చేయించుకుంటోందని చెబుతోంది. తద్వారా అక్కడి నుంచి వచ్చే వస్తువుల దిగుమతికి అర్రరాజ్యం ఒప్పుకోవడం లేదు. చైనా నుంచి వస్తువులను తమ దేశంలోకి రానీయకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. డ్రాగన్ కుయుక్తులను ఎండగుతోంది. దీంతో చైనా ఉత్పత్తులకు మార్కెట్ లేకుండా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Kenya Drought: కెన్యాలో దుర్భిక్ష పరిస్థితులు.. ఎక్కడ చూసినా జంతువుల కళేబరాలే..?
గురువారం సెనేట్ సమావేశమై చైనా ఉత్పత్తులపై నిషేధం విధించింది. ఈ మేరకు ఓ ప్రకటన కూడా చేసింది. దీనిపై అధ్యక్షుడు బైడెన్ సంతకం చేయడమే తరువాయి. దీంతో డ్రాగన్ కుట్రలు సాగనీయకుండా చేసే క్రమంలో దాని మూలాలను దెబ్బతీసేందుకే అమెరికా సిధ్ధమైనట్లు తెలుస్తోంది. అన్ని దారుల్లో చైనా ఉత్పత్తులకు గిరాకీ లేకుండా చేయడమే ప్రధానంగా నిర్ణయించుకుంది.
Also Read: Russia-Ukraine war: మూడో ప్రపంచ యుద్ధానికి రష్యా, ఉక్రెయిన్లు ఆజ్యం పోస్తున్నాయా..?