US Warning To India: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుగా ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం భారత్ మెడకు చుట్టుకుంటోంది. అమెరికా రష్యా విషయంలో భారత్ ఏ వైఖరి అవలంభిస్తుందో చెప్పాలని డిమాండ్ చేస్తోంది. దీంతో భారత్ కు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎన్ఎన్ఏ దలీప్ సింగ్ భారత్ రష్యా సంబంధాలపై తీవ్ర పదజాలంతో దూషించారు. ఎందుకు రష్యాకు భారత్ మద్దతు తెలుపుతోందని ప్రశ్నించారు. భవిష్యత్ లో చైనా చెలరేగితే రష్యా అడ్డుకుంటుందా అనే నినాదం బయటకు తెచ్చి ఇండియాను ఇరుకునపెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

భారత్ రష్యాతో మైత్రి కొనసాగిస్తోంది. కానీ యుద్ధ సమయంలో కూడా ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు కొనసాగించడంపై అమెరికా, ఆస్ట్రేలియా గొంతు కలుపుతున్నాయి. ఇండియా చర్యలను ఆక్షేపిస్తున్నాయి. దలీప్ సింగ్ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, ప్రధాని కార్యాలయ అధికారులు, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
Also Read: AP New Districts: ప్రభుత్వ పంతం.. కొత్త జిల్లాలకు తుది రూపం
చైనా భారత్ పై యుద్ధానికి కాలు దువ్వితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇండియా చైనా యుద్ధం వస్తే రష్యా భారత్ కు సహకరిస్తుందా? భారత్ రష్యాపై ఆధారపడటం ఆపితే మంచిది. రష్యా అందించే దిగుమతులపై ఆధారపడి భారత్ దానికి వత్తాసు పలకడం ఏం బాగా లేదని విమర్శలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు భారత్ ఒంటరిగా మిగిలే అవకాశం ఏర్పడింది. అమెరికా దృష్టిలో కూడా వ్యవతిరేకత వస్తోంది. ఇండియాను టార్గెట్ చేసుకుని అగ్రదేశం విమర్శలకు దిగడం తెలుస్తోంది.

ఈ పరిస్థితుల్లో భారత్ పై అమెరికా వైఖరి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎటో ఒక వైపు ఉండాల్సిందేనని పట్టుబడుతోంది. దీంతో భారత్ కు ఇబ్బందిగా మారుతోంది. అగ్రరాజ్యం మాత్రం భారత్ వెంట పడుతోంది. ఏదో ఒకటి తేల్చాలని సూచిస్తోంది. ఈ క్రమంలో వాణిజ్య ఒప్పందాలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. భవిష్యత్ లో అమెరికా నుంచి మరిన్ని వేధింపులు తప్పేలా లేవు. ఇక ప్రస్తుతం ఏదో ఒకటి తేల్చాల్సిన సమయం ఆసన్నమైందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read: Sri Lanka Financial Crisis 2022: శ్రీలంకలో తీవ్ర సంక్షోభానికి కారణాలేంటి?
[…] MGM Hospital: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు కరువవుతున్నాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందు పడులుతున్నారు. గతంలో కూడా ఆస్పత్రుల తీరుపై విమర్శలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. పారిశుధ్యం సమస్యతో పురుగు పుట్ర రోగులను ఇబ్బందులు పెడుతున్నా సిబ్బంది మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోగిని ఎలుగుకలు కొరికి గాయపరచడం సంచలనం సృష్టిస్తోంది. దవాఖానాల్లో భద్రత ఇంత దారుణంగా ఉందనే విమర్శలు సైతం వస్తున్నాయి. […]