Homeఆంధ్రప్రదేశ్‌Ambati Rambabu : సంబరాల రాంబాబు.. మళ్లీ తన టాలెంట్ చూపించాడు

Ambati Rambabu : సంబరాల రాంబాబు.. మళ్లీ తన టాలెంట్ చూపించాడు

Ambati Rambabu : ఎన్నికలకు ఇంకా షెడ్యూల్ విడుదలకపోయినప్పటికీ..అభ్యర్థుల జాబితాను జగన్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. టికెట్ తమకే వస్తుందనే ఆశతో కొంతమంది వైసీపీ నాయకులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో కలియ తిరుగుతున్నారు. ఆ జాబితాలో అంబటి రాంబాబు ముందు వరుసలో ఉంటారు. సత్తెనపల్లి ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో గెలిచిన ఆయన.. ఏపీలో నీటిపారుదల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తున్నారు.

ఇటీవల సంక్రాంతి వేడుకలు జరిగినప్పుడు సత్తెనపల్లి ప్రాంతంలో సంబరాల రాంబాబుగా అంబటి రాంబాబు అలరించారు. భోగిమంటల చుట్టూ తనదైన శైలిలో స్టెప్పులు వేస్తూ అలరించారు. అంతకుముందు సంక్రాంతి వేడుకల్లో ఆయన వేసిన స్టెప్పులను ఓ సినిమాలో పేరడిగా చూపించారనే విమర్శలున్నాయి. దీనిపై అప్పట్లో అంబటి రాంబాబు ఆ చిత్ర నిర్మాత, దర్శకుడి పై ఘాటుగానే స్పందించారు.

ఇక బుధవారం అంబటి రాంబాబు సత్తెనపల్లి ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. ఒక హోటల్లో దోశలు వేసి కార్యకర్తలకు వడ్డించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు తరదైన శైలిలో చలోక్తులు విసిరారు. “దోశలు వేయడం నాకు బాగా తెలుసు. మా ఆవిడ ఉంటే నాకు వేసే పని ఉండదు. ఒకవేళ ఆమె ఏదైనా ఊరికి వెళ్తే కిచెన్ లోకి వెళ్లి నేను దోశలు వేస్తుంటానని” రాంబాబు వ్యాఖ్యానించాడు. కాగా, రాంబాబు దోశలు వేసిన వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. సంబరాల రాంబాబు గా మాత్రమే కాదు దోశలు వేసే మాస్టర్ గానూ అంబటి రాంబాబు అలరిస్తున్నారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular