అంబానీ vs అమెజాన్ అధినేత.. 1.92 లక్షల కోట్లు ఆవిరి

130 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో ఆన్ లైన్-ఆఫ్ లైన్ రిటైల్ మార్కెట్ అన్నిటికంటే పెద్దది. వేల కోట్ల వ్యాపారం, లాభాలు గడించవచ్చు. ఈ క్రమంలోనే ఈ మార్కెట్ పై పట్టు సాధించేందుకు ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు, దేశంలోనే నంబర్ 1 కుబేరుడి మధ్య ఫైట్ మొదలైంది. Also Read: జాతీయ న్యూస్ చానెళ్లకు నోటీసులు.. సారీ చెప్పాల్సిందే.. దేశంలోనే కుబేరుడైన ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడైన […]

Written By: NARESH, Updated On : October 27, 2020 10:57 am
Follow us on

130 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో ఆన్ లైన్-ఆఫ్ లైన్ రిటైల్ మార్కెట్ అన్నిటికంటే పెద్దది. వేల కోట్ల వ్యాపారం, లాభాలు గడించవచ్చు. ఈ క్రమంలోనే ఈ మార్కెట్ పై పట్టు సాధించేందుకు ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు, దేశంలోనే నంబర్ 1 కుబేరుడి మధ్య ఫైట్ మొదలైంది.

Also Read: జాతీయ న్యూస్ చానెళ్లకు నోటీసులు.. సారీ చెప్పాల్సిందే..

దేశంలోనే కుబేరుడైన ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడైన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మధ్య ‘ఫ్యూచర్ గ్రూప్’ కొనుగోలుపై పెద్ద యుద్ధమే నడుస్తోంది. కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ రిటైల్, గోదాముల వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు రిలయన్స్ రిటైల్ చేసుకున్న ఒప్పందాన్ని.. అంతకుముందు ఫ్యూచర్ కూపన్స్ ను కొనుగోలు చేసిన అమెజాన్ వ్యతిరేకిస్తోంది. దీంతో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని తాజాగా అమెజాన్ ఆశ్రయించింది.

ఇప్పటికే ఫ్యూచర్ గ్రూపును రిలయన్స్ రూ.24వేల కోట్లకు పైగా పెట్టుబడితో కొనుగోలు చేసింది. దీనిపై అమెజాన్ కంపెనీ కోర్టుకు వెళ్లింది. అమెజాన్ కు ఊరటనిచ్చేలా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రిలయన్స్ షేర్ భారీగా పడిపోయింది.

అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తామని కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్) సంకేతాలిచ్చింది.

రెండు బలమైన ఆర్థిక శక్తుల మధ్య గొడవతో ముంబై స్టాక్ మార్కెట్లు సోమవారం చిగురుటాకులా వణికాయి.. సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 540 పాయింట్లు నష్టపోయింది. 40,145.50 వద్ద ముగిసింది. నిఫ్టీ 162.60 పాయింట్లు (1.36శాతం) దిగజారి 11,767.80 వద్ద ముగిసింది.

Also Read: ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్..

మార్కెట్లు కుప్పకూలడంతో ఒక్కరోజే 1.92 లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడం.. అమెరికా సహా పలు మార్కెట్లు నష్టపోవడంతో ఈ ప్రభావం మన మార్కెట్ పైన పడింది.

వీటికి అదనంగా భారత దిగ్గజ కంపెనీ, బీఎస్ఈలో 17శాతం వాటా కలిగిన రిలయన్స్ 3.70శాతం మేర నష్టపోవడంతో భారీగా దెబ్బతీసింది. రిలయన్స్ కు భారీ నష్టం వాటిల్లింది. బీఎస్ఈలో ఒక్కరోజే పెట్టుబడిదారుల సంపద రూ.158.66 లక్షల కోట్లకు పడిపోయాయి.