2023లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ద్వారా 9.8బిలియన్ డాలర్ల వ్యాపారం చేసింది. ఈసారి బ్లాక్ ఫ్రైడే సేల్ ద్వారా ఆ రికార్డును బద్దలు కొట్టాలని భావిస్తోంది. నవంబర్ 29న భారత్‌లో ఈ సేల్ ముగిసే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో డిసెంబర్ 2 వరకు కొనసాగనుంది. బ్లాక్ ఫ్రైడే సేల్ అమెజాన్ ఇండియా 2024 బ్లాక్ ఫ్రైడే సేల్‌లో కస్టమర్లకు ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గేమింగ్ని బ్లాక్‌లో భారీ తగ్గింపులు లభిస్తాయి. బ్లాక్ ఫ్రైడే సేల్‌లో డెల్, శాంసంగ్ వంటి బ్రాండ్ల ల్యాప్‌టాప్‌లపై 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఫ్యాషన్ నిబోసి పురుషుల వాచీలు 50 శాతం వరకు చౌకగా ఉంటాయి. అమెజాన్ కస్టమర్లందరికీ ప్రపంచ స్థాయి అనుభవాన్ని పొందేలా చేసింది. ప్రకటన అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2024 భారతదేశంలో షాపింగ్‌లో కొత్త అధ్యాయాన్ని మాత్రమే కాదు.. కొనుగోలుదారులు నమ్మలేనటు వంటి తగ్గింపును అందించనుంది.
బ్లాక్ ఫ్రైడే సేల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే వీక్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఇది నవంబర్ 21 మధ్యాహ్నం 12.01 గంటలకు ప్రారంభమవుతుంది. నవంబర్ 29 రాత్రి 11.59 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ ప్రారంభం కాకముందే, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ తన ఫైర్ టీవీ స్టిక్‌పై డిస్కౌంట్లను అందిస్తోంది.
ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో మీరు ఐఫోన్‌పై తగ్గింపు పొందుతారు. దీనితో పాటు ఈ సేల్‌లో మీకు స్మార్ట్ఫోన్లపై తగ్గింపు కూడా లభిస్తుంది. దీనిలో మీరు డైరెక్ట్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్, ఈఎంఐ ఆఫ్షన్ ను కూడా పొందుతారు.
వాషింగ్ మెషీన్, రిఫ్రిజిరేటర్పై తగ్గింపు
చాలా మంది దీపావళి,కొత్త సంవత్సరం సందర్భంగా వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లను కొనుగోలు చేస్తారు. ఈ దీపావళి సేల్‌లో మీరు వాషింగ్ మెషీన్, ఫ్రిజ్‌లను కొనుగోలు చేయడం మిస్ అయితే అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.