అమరావతి టీడీపీకి.. విశాఖ వైసీపీకి లాభం? పవన్ వస్తే.?

ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తుంటారు రాజకీయ నాయకులు.. అధికారం మార్పిడి జరగగానే అంతా మారిపోతుంటుంది. ఆ పార్టీ రంగులు జనబాహుళ్యంలోకి వచ్చేస్తాయి. పాత పచ్చ రంగులు కనుమరుగైపోతాయి. అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించకముందే అది లీక్ అయిపోయి టీడీపీ నేతలంతా భూములు కొని పెద్ద ఎత్తున లాభపడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అమరావతి మొత్తం టీడీపీ నేతల చేతుల్లోనే ఉందని.. రాజధాని అయితే బాగుపడేది వారేనని వైసీపీ ఆరోపించింది. అమాయకపు రైతుల నుంచి పెద్ద ఎత్తున భూమిని […]

Written By: NARESH, Updated On : August 4, 2020 11:08 am
Follow us on


ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తుంటారు రాజకీయ నాయకులు.. అధికారం మార్పిడి జరగగానే అంతా మారిపోతుంటుంది. ఆ పార్టీ రంగులు జనబాహుళ్యంలోకి వచ్చేస్తాయి. పాత పచ్చ రంగులు కనుమరుగైపోతాయి. అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించకముందే అది లీక్ అయిపోయి టీడీపీ నేతలంతా భూములు కొని పెద్ద ఎత్తున లాభపడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అమరావతి మొత్తం టీడీపీ నేతల చేతుల్లోనే ఉందని.. రాజధాని అయితే బాగుపడేది వారేనని వైసీపీ ఆరోపించింది. అమాయకపు రైతుల నుంచి పెద్ద ఎత్తున భూమిని ముందే కొని మోసం చేశారనే అపవాదు ఉంది.

Also Read: కాపులు ఐక్యత కోసం బీజేపీలోకి ముద్రగడ?

అందుకే చంద్రబాబు, టీడీపీ నేతలు లక్షల కోట్లు ఖర్చు పెట్టి పెట్టుబడి పెట్టిన అమరావతి కోసం పోరాడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలిస్తే టీడీపీ గగ్గోలు పెట్టడానికి కారణం అదే అంటున్నారు.

ఇదే సమయంలో అమరావతిని రాజధానిగా కొనసాగించడం వల్ల పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి పైసా లాభం లేదు. టీడీపీ వాళ్ల జేబులు నింపడం తప్ప వేరే ఉపయోగం లేదని వైసీపీ సమాలోచనల్లో తేలిపోయింది. అందుకే వైసీపీ నేతలు ఎక్కువగా భూములు కొన్న విశాఖకు మకాం మార్చాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనూ మూడు రాజధానులు ప్రక్రియ తెరపైకి వచ్చిందని టీడీపీ ఆరోపిస్తోంది.

తాజాగా టీడీపీ మాజీ మంత్రి ఒకరు హాట్ కామెంట్స్ చేశారు. ఇక్కడ అమరావతి రాజధాని చేస్తే లక్ష కోట్ల లాభం టీడీపీ నేతలకు కలుగుతుంది. అక్కడ విశాఖను రాజధానిగా చేస్తే వైసీపీ నేతలకు లాభాల పంట పండుతుందని.. రాజధాని అనేది ఒక రియల్ మాఫియా దందా అని స్పష్టం చేశారు.

Also Read: జగన్ భాద్యత వహిస్తాడా ?

దీన్ని బట్టి టీడీపీ, వైసీపీ నేతలు అంతా రాజధాని పేరు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం తప్పితే ప్రజా అవసరాల కోసం ఈ రాజధాని ఏర్పాటు కాదన్నది సగటు సామాన్యుడి ఆవేదన. ఏది అయితేనేమీ ఐదేళ్లకోసారి అధికారం మారినప్పుడల్లా రాజధాని మారకుండా ఈ ఐదేళ్లలోనే రాజధాని విశాఖలో ఫిక్స్ చేస్తే.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చినా ఏపీకి కొత్త రాజధాని రాకుండా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు..

-ఎన్నం