https://oktelugu.com/

‘పుష్ప’ స్టోరీ అదేనా!

సెన్సిబుల్‌ డైరెక్టర్ సుకుమార్, స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్‌ సినిమాలు వస్తున్నాయంటే ఆడియన్స్‌లో క్యూరియాసిటీ ఉంటుంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. తమ ప్రతి సినిమాలో వైవిధ్యం, కొత్తదనం ఉండేలా చూసుకుంటారు సుక్కూ, బన్నీ. అలాంటిది వీరిద్దరి కలయికలో మూవీ అంటే అంచనాలు అమాంతం పెరిగిపోతాయి. ప్రస్తుతం అదే జరుగుతోంది. ‘అల వైకుంఠపురములో’ వంటి క్లాసిక్‌ మూవీతో భారీ హిట్‌ అందుకున్న బన్నీ.. వెంటనే రూటు మార్చి సుకుమార్ తో ‘పుష్ప’ అనే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 4, 2020 / 11:20 AM IST
    Follow us on


    సెన్సిబుల్‌ డైరెక్టర్ సుకుమార్, స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్‌ సినిమాలు వస్తున్నాయంటే ఆడియన్స్‌లో క్యూరియాసిటీ ఉంటుంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. తమ ప్రతి సినిమాలో వైవిధ్యం, కొత్తదనం ఉండేలా చూసుకుంటారు సుక్కూ, బన్నీ. అలాంటిది వీరిద్దరి కలయికలో మూవీ అంటే అంచనాలు అమాంతం పెరిగిపోతాయి. ప్రస్తుతం అదే జరుగుతోంది. ‘అల వైకుంఠపురములో’ వంటి క్లాసిక్‌ మూవీతో భారీ హిట్‌ అందుకున్న బన్నీ.. వెంటనే రూటు మార్చి సుకుమార్ తో ‘పుష్ప’ అనే డిఫరెంట్‌ మూవీకి కమిటయ్యాడు. పాన్‌ ఇండియా మూవీగా ఐదు భాషల్లో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను బన్నీ బర్త్‌డే సందర్బంగా రివీల్‌ చేశారు. గంధం చెక్కల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే మూవీలో బన్నీ.. రఫ్‌ లుక్‌లో వైవిధ్యంగా కనిపించాడు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రంలో బన్నీ ‘పుష్పరాజ్‌’ అనే పాత్రలో కనిపించనుండగా.. రష్మిక.. పోలీస్‌ ఆఫీసర్గా నటిస్తోందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు.

    Also Read: ఎక్స్ పోజింగ్, లిప్ కిస్ ల‌ పై నిత్యా మీన‌న్‌ ఆసక్తి !

    కరోనా ప్రభావం మొదలయ్యే వరకూ కేరళలోని అడవుల్లో షూటింగ్‌ నిర్మహించారు. కానీ, లాక్‌డౌన్‌ విధించిన తర్వాత చిత్రీకరణకు బ్రేక్‌ పడింది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఫారెస్ట్‌ సెట్‌ వేసి షూటింగ్‌ రీస్టార్ట్‌ చేయాలని సుక్కూ భావించినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని తేలింది. మరోవైపు కరోనా వైరస్‌ ఉధృతి పెరగడంతో ఇప్పుడప్పుడే షూటింగ్‌ తిరిగి ప్రారంభమయ్యే పరిస్థితి లేదు. దాంతో, బన్నీ, సుక్కు తమ తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. కొరటాల శివతో అల్లు అర్జున్‌ సినిమా అనౌన్స్‌ చేయగా.. ఈ ఖాళీ టైమ్‌లో ఓ వెబ్‌ సిరీస్‌ తీయాలని సుకుమార్ భావిస్తున్నాడని సమాచారం.

    Also Read: మూడో పెళ్లి చేసుకున్నా సుఖం లేదట !

    షూటింగ్‌ సందడి లేకున్నా కూడా ‘పుష్ప’ ప్రతి రోజూ వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ రోజుకో వార్త హల్‌చల్‌ చేస్తోంది. బన్నీ క్యారెక్టర్లో మూడు కోణాలు ఉంటాయని ఓసారి… కాదు కాదు రెండు షేడ్స్‌ ఉంటాయని ‘రంగస్థలం’ క్లైమాక్స్‌ మాదిరిగా చివర్లో అది రివీల్‌ అవడంతో కథ ఆసక్తికర మలుపు తిరిగి ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేస్తుందని టాలీవుడ్‌ సర్కిల్స్‌లో ఇప్పటికే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో మూవీ గురించి మరో ఆసక్తి కర విషయం బయటికొచ్చింది. ఈ మూవీలో హీరో గంధం చెక్కలు స్మగ్లింగ్‌ చేసినా స్టోరీ మొత్తం దాని గురించే ఉండదట. ‘పుష్ప’.. గ్యాస్‌ లీకేజ్‌ ప్రధానంగా సాగుతుందట. గతంలో ఓఎన్‌జీసీ గ్యాస్‌ లీకేజ్‌, ఈ మధ్య వైజాగ్‌లో ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజ్‌ ఉదంతాల కారణంగా సమీప ప్రాంతాలు, అడవులకు దగ్గరగా ఉండే ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపాయనే బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. గ్యాస్‌ లీకేజ్‌లు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే వాయువుల కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం హీరో చేసే పోరాటమే చిత్ర కథ అని అంటున్నారు. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు గానీ… ‘పుష్ప’ కోసం అభిమానులనే కాదు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారన్నది మాత్రం నిజం.