Amaravati Lands: ఏకైక రాజధాని అమరావతి అనేది వైసీపీ సర్కారుకు ఇష్టం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధాని విషయంలో స్వరం మార్చింది. మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది. కేవలం అమరావతిని శాసనరాజధానికే పరిమితం చేసింది. అలాగని మూడు రాజధానులపై కూడా ముందడుగు వేయలేకపోయింది. అటు అమరావతిని అభివృద్ధి చేయలేకపోయింది. దీంతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది. దానిని నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అటు విపక్షాలనుఇరుకున పెట్టేలా నిర్ణయం తీసుకుంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో అమరావతి రాజధాని నిర్మాణానికి సేకరించిన భూములు పేదల ఇళ్ల స్థలాలకు వినియోగించుకునేందుకు నిర్ణయించింది. రాష్ట్ర పౌరులు ఎవరైనా ఆసక్తి ఉంటే వారికి కేటాయించేందుకు సిద్ధపడింది. అయితే గతంలో కూడా ఇటువంటి నిర్ణయం తీసుకున్నా హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురయ్యింది. అమరావతి రైతులు కోర్టులో పిటీషన్ వేయగా.. రాజధానికి సేకరించిన భూములను ఇతర అవసరాలకు కేటాయించే హక్కు ప్రభుత్వానికి లేదంటూ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో అప్పట్లో భూ పందేరాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. కానీ ఇప్పుడు ఏకంగా సీఆర్డీఏ చట్టాన్ని సవరించి మరీ పేదల ఇళ్ల స్థలాల కోసం అమరావతి భూములు కేటాయింపులు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

టీడీపీపై నెపం..
నవరత్నాల్లో భాగంగా 54,307 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించాలని ప్రభుత్వం అప్పట్లో ప్రయత్నించింది. అయితే రాజధానికి సేకరించిన భూములను.. ఇళ్ల స్థలాలకు ఎలా కేటాయిస్తారని.. అలా చేస్తే సమతూల్యత దెబ్బతింటుందని 29 గ్రామాల ప్రజలు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు రైతులకు అనుకూలంగా అప్పట్లో తీర్పునిచ్చింది. కానీ ఆ పిటీషన్ టీడీపీయే వేయించిందని.. పేదలకు ఇళ్ల స్థలాలు అందించడం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదని అప్పట్లో వైసీపీ ప్రజాప్రతినిధులు ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇప్పుడుమరోసారి టీడీపీని ఇరకాటంలో పెట్టి నవరత్నాలు, అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా స్థలాల కేటాయింపునకు ఏకంగా సీఆర్డీఏ చట్టంలో కీలక సవరణలు చేశారు. రాజధాని ఫర్ఫెక్టివ్ ప్లాన్, బృహుత్తర ప్రణాళిక, మౌలిక వసతుల ప్రణాళికలో మార్పులు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ…సీఆర్డీఏ చట్టంలో ప్రతిపాదించిన సవరణలకు కేబినెట్ ఆఘమేఘాలపై అమోదం తెలిపింది.
Also Read: YCP Graph: ఆరు నెలల్లోనే గ్రాఫ్ డౌన్… వైసీపీలో టెన్షన్ టెన్షన్
గతంలో కోర్టు బ్రేక్..
వాస్తవానికి రాజధాని రైతుల నుంచి సేకరించిన భూములు ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు వినియోగించడం నిబంధనలకు విరుద్ధం. జోనల్ రెగ్యులేషన్ నిబంధనలకు విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది.దీంతో సర్కారు కొత్త ఎత్తుగడ వేసింది. ఏకంగా రాజధాని మాస్టర్ ప్లాన్ నే మార్చేస్తున్నారు. చట్టంలో ఇష్టారాజ్యంగా సవరణలు తీసుకొస్తున్నారు. సీఆర్డీఏ చట్టంలో కనిపించని 53(1)ని సృష్టించారు. అడ్డగోలు వాదనను తెరపైకి తెచ్చారు. రాజధానిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఇళ్ల పథకాలకు స్థలాల కేటాయింపు సహేతుకమని చెబుతున్నారు. 29 గ్రామాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పేదలు ఇక్కడి స్థలాలు దక్కించుకునేందుకు అర్హులేనని తేల్చిచెబుతున్నారు.

జీవో జారీ..
అటు చట్టంలో సవరణలకు ఆమోదించడమే తరువాయి అఘమేఘాల మీద జీవోకూడా జారీచేశారు. మొత్తం 54,307 ప్లాట్లు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రంలో అర్హులంతా పథకానికి దరఖాస్తు చేసుకొవచ్చని కూడా స్పష్టం చేశారు. దీనిపై రాజధాని రైతు భగ్గుమంటున్నారు. అటు హైకోర్టు 6 నెలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించినా ప్రభుత్వం పెడచెవిన పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read:Munugode Bypolls: తమ్ముడు రాజగోపాల్ రెడ్డిపై ప్రేమతో అన్న వెంకటరెడ్డి చేసిన పని..? అడ్డంగా బుక్?
[…] […]