Chanakya Niti For Woman: ఆచార్య చాణక్యుడు జీవితంలో ఎదిగేందుకు కావాల్సిన అలవాట్లను ఆనాడే చెప్పాడు. ఆయన సూచించిన చాలా విషయాలు మనకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. అప్పటి పరిస్థితుల్లో కూడా ఆయన మనకు చెప్పిన విషయాలు మనకు కలిసి వస్తున్నాయి. కుటుంబం మనుగడ సాగించాలంటే స్ర్తీల పాత్ర ముఖ్యమని గుర్తించాడు. దీంతో ఆడవారు బాగా ఉంటే కుటుంబం ప్రగతి సాధిస్తుందని ఆనాడే గుర్తించి వివరించాడు. ఆడవారి గురించి అనేక విషయాలు మనకు తెలియజేశాడు. వారితో మనకు కలిగే అనర్థాల గురించి కూడా విశదీకరించాడు.

స్త్రీలకు నోట్లో మాట ఆగదు. ఆడదాని నోట్లో ఆవగింజ కూడా నానదట. ఇక్కడి విషయాలు అక్కడ అక్కడి విషయాలు ఇక్కడ చెబుతూ అపార్థాలు సృష్టిస్తుంటారు. అలాంటి వారితో కష్టమే. నిత్యం ఏవో గొడవలు వస్తుంటాయి. ఇలాంటి వారితో చిక్కులే వస్తాయి. ఒక్కోసారి పరిణామాలు తీవ్రంగా మారే అవకాశం కూడా ఉంటుంది. వీరి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే మనకే ఇబ్బందులు తలెత్తుతాయి. ఎవరైనా రహస్యంగా ఉంచమని చెబితే వారు బహిరంగంగా అందరికి చెబుతూ కష్టాలు తెస్తారు.
Also Read: Amaravati Lands: పేదల ఇళ్లకు అమరావతి భూములు.. జగన్ సర్కారు కీలక నిర్ణయం
తన కోపమే తన శత్రువు అన్నారు. అది ఆడవారికైనా మగవారికైనా కోపంతో నష్టాలే. నిగ్రహం కోల్పోతేనే ఆగ్రహం కలుగుతుంది. దీంతో ఎన్నో అనర్థాలు కలుగుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే అంతేసంగతి. మన ఎదుగుదలకు మన కోపం ప్రతిబంధకంగా మారుతుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే నష్టాలే ఎక్కువ అవుతాయి. ఎప్పుడైనా కోపం మనిషిపై ఆధిపత్యం చెలాయించకూడదు. కోపం ఎక్కువైతే దాడి చేసే ఆస్కారం ఉంటుంది. మనిషికి కోపం శత్రువులనే పెంచుతుంది.

డబ్బు ఖర్చు చేయడం కూడా ఓ కళే. ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు ఎలా ఖర్చు చేస్తున్నామన్నదే కావాలి. జీవితంలో ఖర్చులే కాకుండా పొదుపు కూడా చేస్తేనే ఫలితం ఉంటుంది. భవిష్యత్ అవసరాలకు కొంత డబ్బును దాచుకుంటే అవసరాలకు పనికి వస్తుంది. అవసరమైన చోట ఖర్చుకు వెనకాడకూడదు. అనవసరమైన చోట ఖర్చు పెట్టకూడదని తెలుసుకోవాలి. ఇలా చేస్తేనే జీవితంలో మనకు ఎలాంటి ఆపదలు రాకుండా ఉంటాయనడంలో సందేహం లేదు.
Also Read:Brahmastra First Review: ‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే ?