Amanchi Krishna Mohan: కమ్మ సామాజిక వర్గం పై ఆమంచి కృష్ణమోహన్ షాకింగ్ కామెంట్స్

వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కులాన్ని వర్గ శత్రువుగా చూస్తోంది. అదే కులానికి చెందిన నాయకులను కొంతమందిని చేరదీసింది. అటువంటి వారంతా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

Written By: Dharma, Updated On : August 12, 2023 3:03 pm

Amanchi Krishna Mohan

Follow us on

Amanchi Krishna Mohan: ఏపీలో కుల రాజకీయం అధికం. మూడు ప్రధాన సామాజిక వర్గాలు… మూడు పార్టీలకు కొమ్ము కాస్తున్నాయి. అలాగని ఆ పార్టీలో ఇతర సామాజిక వర్గాలు లేదని చెప్పలేం. కానీ ఆయా పార్టీల్లో క్రియాశీల రాజకీయాలు చేసేది మాత్రం ఆ సామాజిక వర్గానికి చెందినవారే. అయితే ఈ క్రమంలో కులాల పై దాడి జరుగుతోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో వైసీపీ సీనియర్ నేత ఆమంచి కృష్ణమోహన్ కమ్మ కులాన్ని టార్గెట్ చేసుకున్నారు. ఆ కులం పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై కమ్మ సామాజిక వర్గీయులు మండిపడుతున్నారు.

అయితే ఆమంచి కృష్ణమోహన్ కు కమ్మ కులం పై ద్వేషానికి కారణం చీరాల. ప్రస్తుతం చీరాల నియోజకవర్గానికి కరణం బలరామకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన టిడిపి నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఆమంచి పై గెలుపొందారు. ఎన్నికల అనంతరం వైసీపీలోకి ఫిరాయించారు. అప్పటి నుంచి అక్కడ గలాటా ప్రారంభమైంది. మాకు ఏమైనా గనులు ఉన్నాయా? మైనింగ్ ఉందా? మేమెందుకు పార్టీ మారుతామంటూ కరణం బలరాం పెద్దపెద్ద డైలాగులు కొట్టారు. వైసీపీలో చేరిపోయారు.

అయితే అప్పటికే వైసిపి నేతగా ఉన్న ఆమంచి దీనిని జీర్ణించుకోలేకపోయారు. బలరాం రాకను వ్యతిరేకించారు. అయినా సరే జగన్ బలరాంను చేర్చుకున్నారు. అప్పటినుంచి రెండు వర్గాలు భగ్గుమంటున్నాయి. దీనికి పరిష్కారం మార్గం చూపేందుకు జగన్ ఆమంచి కృష్ణమోహన్ కు పర్చూరు బాధ్యతలు అప్పగించారు. కానీ చీరాలపై ఉన్న మమకారాన్ని కృష్ణమోహన్ వదులుకోవడం లేదు.

చీరాల తనదేనంటూ భావించిన కృష్ణ మోహన్ కు బలరాం దెబ్బేశారు. అందుకే బలరాంపై కృష్ణమోహన్ కు పట్టలేనంత కోపం ఉంది. ఇటీవల వార్డు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. దీంతో తన వర్గీయులను నిలబెట్టేందుకు కృష్ణమోహన్ ప్రయత్నించారు. దీంతో అక్కడ గొడవలు జరిగాయి. దీనంతటికీ బలరాం, ఆయన కుమారుడే కారణమని… కమ్మ నా కొడుకులంటూ కృష్ణ మోహన్ దుర్భాషలాడారు.

వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కులాన్ని వర్గ శత్రువుగా చూస్తోంది. అదే కులానికి చెందిన నాయకులను కొంతమందిని చేరదీసింది. అటువంటి వారంతా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పదవుల కోసం తమను తాము తగ్గించుకుంటున్నారు. సొంత సామాజిక వర్గం పైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఆమంచి కృష్ణమోహన్ తాజా వ్యాఖ్యలపై కమ్మ సామాజిక వర్గీయులు ఆగ్రహంగా ఉన్నారు. తమను వర్గ శత్రువుగా భావిస్తున్న వైసీపీలో చేరిన సొంత సామాజిక వర్గ నేతల తీరును తప్పుపడుతున్నారు. రాజకీయ పదవుల కోసం కులాన్ని పణంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.