Homeజాతీయ వార్తలుPunjab Political Crisis: పంజాబ్ కాంగ్రెస్ లో ముదిరిన సంక్షోభం.. సిద్దూ ధిక్కారం

Punjab Political Crisis: పంజాబ్ కాంగ్రెస్ లో ముదిరిన సంక్షోభం.. సిద్దూ ధిక్కారం

Navjot Singh SidhuPunjab Political Crisis: పంజాబ్ (Punjab) లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. దేశంలో అతి కొద్ది స్టేట్లలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ (Congress) పార్టీ తమ నేతలను పదిలంగా ఉంచుకోవడంలో వెనుకబడిపోతోంది. ఇప్పటికే చత్తీస్ గడ్ లో సైతం ఇదే తరహాలో పరిణామాలు చోటుచేసుకోవడంతో పార్టీ విచిత్రమైన పరిస్థితిలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. పంజాబ్ లో పీసీసీ అధ్యక్షుడిగా నవజ్యోతి సింగ్ సిద్దూను (Navjot Singh Sidhu) నియమిస్తే మంచి ఫలితాలు ఉంటాయని భావించినా అది నిజం కాదని తెలిసిపోతోంది. ప్రస్తుతం అధిష్టానంపై తన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఎదురవుతోంది.

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కు సిద్దూ కు మధ్య విభేదాలు తారాస్థాయికి పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అధికార మార్పునకే సిద్దూ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. సీఎం అమరీందర్ సింగ్ ను మార్చాల్సిందేనని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగరవేసిన నేపథ్యంలో అధిష్టానం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటోందోనని అందరిలో ఆసక్తి నెలకొంది. కానీ రాష్ర్ట పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులే ఎదురు కాబోతున్నాయని సమాచారం.

దీంతో ముఖ్యమంత్రి సిద్దూ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అమృత్ సర్ లో తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. పీసీసీ చీఫ్ గా సిద్దూ రెచ్చిపోతున్నారు. అధిష్టానం మాత్రం ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. సీఎం, సిద్దూ వ్యవహారంలో ఏ చర్య తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో ఇద్దరు మాటల యుద్ధం చేస్తున్నారు. రాష్ర్టంలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం, సిద్దూ వ్యవహారంలో హైకమండ్ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా చొరవతోనే పీసీసీ చీఫ్ అయిన సిద్దూ పార్టీని బలోపేతం చేయడం మాట అటుంచి సంక్షోభం ముదరడానికి ప్రధాన కారణం అవుతున్నారు. అమరీందర్, సిద్దూ మద్దతు దారులు రెండుగా చీలిపోయి బహిరంగంగా విమర్శలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో పార్టీ ప్రతిష్ట మరింత దిగజారిపోతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా పార్టీని ఇనుమడింపజేసే విధంగా వ్యవహరించాల్సిన నేతలు స్వార్థ ప్రయోజనాల కోసం పరస్పరం ఆరోపణలకు దిగడం పార్టీకే నష్టం జరిగే అవకాశాలున్నాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version