Railway Budget 2025 : కేంద్రం 2025-26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను శనివారం(ఫిబ్రవరి 1న) పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ వరుసగా ఎనిమిదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో రైల్వేలకు భారీగా కేటాయింపులు చేశారు. ఈ నిధుల నుంచి సోమవారం రాష్ట్రాల వారీగా కేటాయింపులు చేశారు. తెలుగు రాష్ట్రాలకు చేసిన కేటాయింపుల వివరాలను రైలే‍్వ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
కేంద్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైల్వేకు కేంద్రం ఈసారి కూడా గతేడాది తరహాలోనే నిధులు కేటాయించింది. ఈసారి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈ బడ్జెట్‌లో రూ.2.52 లక్షల కోట్లు కేటాయించింది. రూ.3.02 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో కేటాయించిన రూ.2.52 లక్షల కోట్లను రాష్ట్రాల వారీగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కేటాయించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యం దక్కలేదు. ఈ బడ్జెట్‌లో ఏపీకి రూ.9,417 కోట్లు కేటాయించారు. యూపీఏ కన్నా ఈ కేటాయింపులు 11 రెట్లు ఎక్కువ అని తెలిపారు. ఏపీలో 74 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేశామని తెలిపారు. ఏపీలో ఇప్పటికే అనేక రైల్వే పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. అందుకే బడ్జెట్‌లో ప్రస్తావించలేదని పేర్కొన్నారు. రైల్వే ప్రాజెక్టుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరగదని కూడా స్పష్టం చేశారు. రైలే‍్వ బడ్జెట్‌లో తెలంగాణకు రూ.5,337 కోట్లు కేటాయించామని తెలిపారు.
ఏపీకి రికార్డు కేటాయింపులు..
ఈ బడ్జెట్‌లో ఏపీలో రైల్వేకు ఈసారి రికార్డు స్థాయిలో కేటాయింపులు జరిగాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈసారి రాష్ట్రానికి రూ.9,417 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. తెలంగాణకు రూ.5,337 కోటు‍్ల కేటాయించడం జరిగిందన్నారు. కాజీపేట రైల్వే ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణకు రూ.41,677 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. తెలంగాణకు త్వరలో నమో భారత్, అమృత్ భారత్ రైళ్లు కూడా వస్తాయని తెలిపారు. ఏపీలో రూ.84,559 కోట్ల పనులు నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఏపీలో 74 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. 1,560 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేశామని తెలిపారు.
ఐదేళ్లలో రూ.4.6 లక్షల కోట్ల కొత్త ప్రాజెక్టులు
ఇక రైల్వే పరంగా రాబోయే ఐదేళ్లలో రూ.4.6 లక్షల కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడతామని తెలిపారు. వీటిలో కొత్త లైన్లు, డబ్లింగ్, నాలుగు లైన్ల విస్తరణ, కొత్త నిర్మాణాలు, స్టేషన్ల అభివృద్ధి, వంతెనలు, అండర్ పాస్‌లు ఇలా అనేకం ఉన్నాయని వివరించారు. మార్చి నెలాఖరులోపు 1,400 జనరల్ బోగీలు తయారు చేయనున్నట్లు తెలిపారు. వెయ్యి రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతులు మంజూరుచేసినట్లు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి నూరుశాతం విద్యుదీకరణ సాధించాలని లక్ష్యంగా పెటు‍్టకున్నామని తెలిపారు.
భద్రతకు పెద్దపీట..
ఈ బడ్జెట్‌లో రైలేవ్ల భద్రతకు పెద్దపీట వేశామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. అందుకు బడ్జెట్‌ను రూ.1.08 లక్షల కోట్ల నుంచి రూ.1.16 లక్షల కోట్లకు పెంచామని పేర్కొన్నారు. 2024-25లో సవరించిన అంచానల ప్రకారం రైల్వే భద్రతకు రూ.1,14,062 కోట్లు కేటాయించగా, 2025-26 బడ్జెట్ అంచనాల్లో రూ.1,16,514 కోట్లు కేటాయించామని వివరించారు. ఏడాదికి 4 వేల కిలోమీటర్ల కొత్త లైన్లు నిర్మిస్తామని తెలిపారు. గడిచిన పదేళ్లలో 31,180 కిలోమీటర్ల కొత్త ట్రాక్ నిర్మించామని తెలిపారు.