AP BJP: ఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరికి ఎవరు మిత్రులో, ఎవరికి శత్రువులో తెలియడం లేదు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ బద్ధ విరోధులుగా ఉన్నారు. కేంద్రంలోని ఎన్టీఏ ప్రభుత్వ ప్రాపకానికి ఇద్దరూ పోటీపడుతున్నారు. పోటీపడి మరీ బీజేపీ పెద్దలతో స్నేహం చేస్తున్నారు. అటు బీజేపీ శాశ్వత మిత్రపక్షంగా జనసేనను కొనసాగిస్తూనే అటు వైసీపీ, టీడీపీకి కూడా స్నేహహస్తం చాస్తోంది.అయితే రాజకీయంగా, సంఖ్యాబలంగా వైసీపీ ఉంది కాబట్టి దానికి కాస్త ప్రాధాన్యతనిస్తుంది. అయితే వైసీపీ సర్కారు ఆర్థిక క్రమశిక్షణ కట్టుదాటుతున్నా, రాష్ట్ర భవిష్యత్ ను అంధాకరంలో పెడుడున్నా.. లెక్కపత్రం లేని అప్పులు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నియంత్రించడం లేదు. పైగా రాజకీయంగా ఇబ్బందులు వస్తున్న ప్రతీసారి జగన్ సర్కారుకు ఇతోధికంగా సాయపడుతోంది. దీనిని రాజకీయ నిపుణులు, ఆర్థిక మేధావులు సైతం తప్పుపడుతున్నారు. అయితే ఇదంతా బీజేపీ మైండ్ గేమ్ గా భావిస్తున్నారు. మూడు రాజకీయ పక్షాలతో స్నేహంగా ఉండి ఎన్నికల్లో ఏ పార్టీతో లాభముంటే దానితో కలిసి నడవాలని బీజేపీ ఫిక్స్ అయినట్టుంది.

అయితే బీజేపీ వ్యవహరిస్తున్న తీరుతో జనసేనకు ఓపిక నశీస్తున్నట్టుంది. గత ఎన్నికల తరువాత ఈ రెండు పార్టీలు జట్టు కట్టాయి. కలిసే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. అయితే తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ ఏ విషయంలోనూ బీజేపీ జనసేనతో కలిసి రావడం లేదు. అటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆ రెండు పార్టీలు వేర్వేరుగానే ఆందోళనలు చేపడుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే అంటీముట్టనట్టుగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీతో కటీఫ్ చెబితేనే మేలని జనసేనలోని మెజార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పవన్ తో బీజేపీ బలపడాలని భావిస్తోంది తప్ప.. జనసేనకు బీజేపీతో ఎటువంటి ప్రయోజనం లేదని చెబుతున్నారు. సంస్థాగత బలమున్న టీడీపీతో కలిసి నడవమే మేలని.. సీట్లపరంగా లబ్ధి పొందవచ్చని కొందరు జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Nadamuri Balakrihsna: బాబాయ్ బాలయ్య ఫైర్…,జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడంటూ చర్చ
అటు బీజేపీ నేతల వ్యవహార శైలి పవన్ కు కూడా రుచించడం లేదని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని అధికారంలోకి రానివ్వనని పవన్ శపధం చేశారు. అందుకు తగ్గట్టుగానే ప్రజల మధ్య జగన్ సర్కారును ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తనకు సహకరించకపోయినా పర్వాలేదు కానీ.. జగన్ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న వంచనకు సహకరించవద్దని బీజేపీ నేతలకు పవన్ విన్నవించాడు. కానీ జగన్ చేస్తున్న ఆర్థిక తప్పులను కూడా బీజేపీ పెద్దలు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇష్టరాజ్యంగా అప్పులకు అనుమతిస్తున్నారు. కాగ్ నివేదికలో ఏపీ ప్రభుత్వానికి తప్పుపడుతున్నా కేంద్ర పెద్దలకు పట్టడం లేదు. కేవలం జాతీయ రాజకీయ ప్రయోజనాలను ఆశించే ఈ విధంగా చేస్తుండడాన్ని పవన్ తప్పుపడుతున్నారు.

రాష్ట్రంలో టీడీపీతో కలిస్తేనే రాజకీయ లక్ష్యం సాధ్యమని పవన్ భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో కలిసే నడుద్దామంటూ బీజేపీపై ఒత్తిడి పెంచుతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై బీజేపీ పెద్దలు ఎటువంటి స్పష్టతనివ్వడం లేదు. నాన్చుడు ధోరణితో వెళుతున్నారు. ఇది వైసీపీకి లాభిస్తుందని పవన్ అభిప్రాయపడుతున్నారు. ఎదురుచూసి విసిగి వేశారిపోయిన పవన్ ఇక లాభం లేదనుకొని బీజేపీకి దూరంగా జరగడానికి నిర్ణయించుకున్నారు. ఇప్పుడిదే జనసేనలో హాట్ టాపిక్ గామారింది. జనసేనతో స్నేహం పెట్టుకొని బీజేపీ వైసీపీ వెంపర్లాడుతోందని జనసేన నేతలైతే మండిపడుతున్నారు.
[…] […]