Ali Daughter Marriage- Pawan Kalyan: పవన్ సినిమాల్లో అలీ తప్ప మరో కమెడియన్ కనిపించరు.కానీ గత రెండు మూవీస్ లో ఆలీ లేడు. దీంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం ఇద్దరూ వ్యతిరేక పార్టీల్లో ఉండడమే. ఇటీవల పవన్ పై ఆలీ కొన్ని సున్నిత విమర్శలు చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆలీపై ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలీ తన కూతురు వివాహానికి పవన్ ను ఆహ్వానించారట. పవన్ ఇంటికి వెళ్లి మరీ పెళ్లి కార్డు ఇచ్చి తప్పకుండా రావాలని కోరినట్లు తెలుస్తోంది. మరి పవన్ ఈ పెళ్లికి వెళ్తాడా..?

సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి చాలా మంది నటులు వెళ్లి మంచి పొజిషన్లో ఉన్నారు. వీరిలో కమెడియన్ అలీ ఒకరు. ఎంతో కాలంగా సినీ ఇండస్ట్రీలో కొనసాగిన ఆలీ గత ఎన్నికల్లో వైసీపీలో చేరారు. ఇన్నాళ్లకు ఆయనకు సలహాదారుడిగా పదవిని దక్కించుకున్నాడు. ఇటీవల ఆయన కూతురు వివాహం సందర్భంగా ఆయనకు ఈ పదవి రావడంతో తనకు జగన్ బహుమతి ఇచ్చారని అన్నారు. ఇందులో భాగంగా తన కూతురు వివాహానికి రావాల్సిందిగా ఆలీ సతీసమేతంగా ఏపీ ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.
తాజాగా తన కూతురు ఫాతిమా వివాహానికి రావాల్సిందిగా పవన్ ను ఆలీ కోరాడట. కానీ దీనిని పవన్ ఫ్యాన్స్ ధ్రువీకరించడం లేదు. ఆలీ పవన్ పై రకరకాల విమర్శలు చేసినందున.. ఆయన పవన్ ను కలిసే అవకాశం లేదని అంటున్నారు. కానీ కొందరు మాత్రం రాజకీయంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నా.. ఇద్దరి మధ్య స్నేహ భావ సంబంధం కొనసాగుతుందని అంటున్నారు. గతంలో పవన్ ప్రతీ సినిమాలో అలీ ఉన్నారు. పాత్ర అవసరం లేకున్నా ఆలీ కోసం సృష్టించి మరీ సినిమాల్లో పెట్టుకునే వారు. అందువల్ల వీరి మధ్య ఆ స్నేహం కొనసాగుతుందని అంటున్నారు.

అయితే ‘ఆలీతో సరదాగా’ అనే ప్రొగ్రాంకు కూడా పవన్ వస్తున్నారని గతంలో ప్రచారం జరిగింది.కానీ అది సాధ్యపడలేదు. ఆలీతో ఎలాంటి స్నేహం ఉన్నా.. అలా వెళితే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని వెళ్లలేదని కొందరు చెప్పుకొచ్చారు. మరికొందరు మాత్రం ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండడంతోనే ఆలీ కార్యక్రమానికి హాజరు కాలేదన్నారు. ఏదీ ఏమైనా ఆలీతో ఉన్న స్నేహం కారణంగా పవన్ ఆయన కూతురు వివాహానికి హాజరవుతారా..? అనేది చర్చనీయాంశంగా మారింది.