https://oktelugu.com/

Ali Akbar: బిపిన్ రావత్ పై పెట్టిన పోస్టులకు తట్టుకోలేక.. ఇస్లాం నుంచి హిందూ మతానికి ప్రముఖ డైరెక్టర్

Ali Akbar:  దేశ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ఇటీవల హెలీక్యాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన మరణంతో త్రివిధ సిబ్బందితో పాటు యావత్ భారతదేశం కన్నీటి శోక సంద్రంలో మునిగింది. కానీ కొందరు బిపిన్ రావత్ మరణించడం సంతోషకరమని సోషల్ మీడియా వేదికగా హ్యాపీ ఏమోజీ పోస్టులను పెట్టారు. కాశ్మీర్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చినందునే ఆయన మరణించారని కొందరు కామెంట్లు పెట్టారు. అయితే వీటిపై కేరళకు చెందిన ఓ సినీ దర్శకుడు అలీ అక్బర్ రియాక్ట్  అయ్యాడు. […]

Written By:
  • NARESH
  • , Updated On : December 12, 2021 9:23 am
    Follow us on

    Ali Akbar:  దేశ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ఇటీవల హెలీక్యాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన మరణంతో త్రివిధ సిబ్బందితో పాటు యావత్ భారతదేశం కన్నీటి శోక సంద్రంలో మునిగింది. కానీ కొందరు బిపిన్ రావత్ మరణించడం సంతోషకరమని సోషల్ మీడియా వేదికగా హ్యాపీ ఏమోజీ పోస్టులను పెట్టారు. కాశ్మీర్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చినందునే ఆయన మరణించారని కొందరు కామెంట్లు పెట్టారు. అయితే వీటిపై కేరళకు చెందిన ఓ సినీ దర్శకుడు అలీ అక్బర్ రియాక్ట్  అయ్యాడు. బిపిన్ రావత్ పై ఇలాంటి పోస్టులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఏకంగా ఇస్లాం మతం వదిలి హిందూ మతాన్ని స్వీకరించారు. అంతేకాకుండా తన పేరును రామ సింహన్ గా మార్చుకున్నట్లు తెలిపారు. ఇక బిపిన్ రావత్ పై వ్యతిరేక పోస్టులు పెట్టినవారిపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

    Ali-Akbar-quits-Islam-to-become-Hindu

    Ali-Akbar-quits-Islam-to-become-Hindu

    కేరళకు చెందిన అలీ అక్బర్ ‘1921 ఫ్రమ్ రివర్ టు రివర్’ అనే సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. కేరళలోని మలబార్ తీరంలో బ్రిటన్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో మతఘర్షనలు జరిగాయని, ఇందులో హిందువులను ముస్లింలు ఊచకోత కోశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళ్లో ఇస్లామీకరణ ఉద్యమం 1970లోనే ప్రారంభమైందని, గల్ఫ్ దేశల నుంచి వచ్చే డబ్బును దానికోసం ఖర్చు చేస్తున్నారని అన్నారు. ఈ సమయంలో ప్రభుత్వం అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. పదేళ్ల క్రితం కువైట్లో ఉన్నప్పుడు ఈ విషయంపై ఫిర్యాదు కూడా చేశానన్నారు.

    అలీ అక్బర్ ఒక మస్లిం.. క్రిస్టియన్ అయిన తన భార్య లూసీ, ఆయన తల్లి కలిసి వచ్చే వారంలో హిందూ మతం స్వీకరించబోతున్నారు. ఇక అలీ అక్బర్ దంపతుతకు ఇద్దరు పిల్లలు వారు మేజర్లు కాబట్టి వారు ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘హిందుత్వం ఒక మతం కాదు.. ఒక సంస్కృతి. భగవంతుడు మనలోనే ఉంటాడు. మనలోనే దేవుడిని చూసుకోవడం అత్యున్నత ఆలోచన’ అని ఆయన అన్నారు. కాగా కేరళలో 1947న భారత స్వాతంత్ర్యానికి ముందు రామసింహన్ అనే వ్యక్తి ముస్లిం మతం నుంచి హిందు మతానికి మారారు. అయితే ఆయితే అతడిని హత్య చేశారు. ఇప్పుడు ఆయన పేరునే అలీ అక్బర్ పెట్టుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు.

    ముస్లింలు హిందు మతం మారేలా ప్రేరేపిస్తున్నారని, అందుకు ఏఆర్ రహమానే కారణమని అలీఅక్బర్ 2018లో కామెట్లు చేశారు. దీంతో తనపై దాడి కూడా జరిగిందని తెలిపారు. అంతకుముందు మదరసాలో ఉన్న సమయంలో మత పెద్దలు తనను వేధించారని అలీ అక్బర్ అన్నారు. అయితే కొందరు ఆర్ఎస్ ఎస్ భావాజాలన్ని అనుసిస్తున్నారన్న ప్రశ్నకకు ‘నేను ఆ భావాజాలాన్ని అనుసరించలేదు. ఆర్ఎస్ఎస్ భారత సాంస్కృతిక శాఖ. అందులో ముస్లిం వేదిక కూడా ఉంది. అది అక జాతీయవాద సంస్థ’ అని తెలిపారు.

    ఇటీవల అలీ అక్బర్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. ఇందులో ‘నేను పుట్టినప్పుడు వేసుకున్న బట్టలను ఇప్పుడు వదిలేస్తున్నాను.. ఇక నుంచి నేను భారతీయుడిని. భారత్ కు వ్యతిరేకంగా ఏమోజీలు పెడుతున్న వారికి నా సమాధానం ఇదే’ అని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వీడియోపై విపరీతమైన కామెంట్లు రావడంతో దానిని తొలగించారు. ఇక ఆ తరువాత మాట్లాడుతూ ‘ నేను పుట్టి పెరిగింది ఒక గ్రామంలో. ఇక్కడ అందరూ క్రిస్టియన్లే. అక్కడ ఓ పెద్ద చర్చి కూడా ఉంది. కాన కొందరు ఛాందస ముస్లింలు గ్రామంల పేరిట ఇరితి పేట నుంచి అరువీధురగా మార్గాలని అనుకుంటున్నారు. అది ఒక క్రిస్టియన్ ప్రాంతం కాబట్టి వాళ్లు అలా మార్చాలనుకుంటున్నారు’ అని తెలిపారు.