https://oktelugu.com/

నావల్నీకి రెండేళ్ల జైలు శిక్ష

ఓవైపు దేశ ప్రజలు దారిద్య్రంతో కొట్టుమిట్టాడుతుంటే, పుతిన్‌ అవినీతి పెద్ద స్థాయిలో ఉండటంతో ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం అరెస్టు చేసిన ప్రతిపక్ష నాయకుడు నావల్నీని విడుదల చేయాలని, అధ్యక్ష పదవికి పుతిన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ రష్యాలో వేలాదిమంది నిరసనల బాట పట్టి, వీధుల్లో కదం తొక్కుతూనే ఉన్నారు. Also Read: అధ్యక్ష పీఠం కోసమే ఆ తిరుగుబాటా..? తాజాగా.. అలెక్సీ నావల్నీకి మాస్కో కోర్టు రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. గతంలో […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 3, 2021 1:26 pm
    Follow us on

    Navalny
    ఓవైపు దేశ ప్రజలు దారిద్య్రంతో కొట్టుమిట్టాడుతుంటే, పుతిన్‌ అవినీతి పెద్ద స్థాయిలో ఉండటంతో ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం అరెస్టు చేసిన ప్రతిపక్ష నాయకుడు నావల్నీని విడుదల చేయాలని, అధ్యక్ష పదవికి పుతిన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ రష్యాలో వేలాదిమంది నిరసనల బాట పట్టి, వీధుల్లో కదం తొక్కుతూనే ఉన్నారు.

    Also Read: అధ్యక్ష పీఠం కోసమే ఆ తిరుగుబాటా..?

    తాజాగా.. అలెక్సీ నావల్నీకి మాస్కో కోర్టు రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. గతంలో రద్దుచేసిన శిక్షకు సంబంధించిన షరతులను ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ శిక్ష విధిస్తున్నామని తెలిపింది. అలెక్సీ నావల్నీపై గత ఆగస్టులో స్వదేశంలోనే విష ప్రయోగం జరిగిన సంగతి తెలిసిందే. జర్మనీలో దాదాపు ఐదు నెలల చికిత్స అనంతరం జనవరి 17న రష్యా చేరుకున్నారు. పోలీసులు ఆయన్ని విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు.

    ఇదిలా ఉండగా.. తనపై వస్తున్న ఆరోపణలన్నీ కూడా అధికార పార్టీ కల్పితాలేనని నావల్నీ ఆరోపించారు. కోర్టు తీర్పు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అధ్యక్షుడు పుతిన్‌ను ‘లో దుస్తుల్లో విషం పెట్టే వ్యక్తి’గా అభివర్ణించారు. తనపై విషప్రయోగం పుతిన్‌ కుట్రేనని ఆరోపించారు. కోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా తాము అప్పీలు చేస్తామని నావల్నీ తరఫు న్యాయవాది చెప్పారు.

    Also Read: మోడీ మళ్లీ పర్యటనల గోల.. ఈసారి ఎన్ని దేశాలో..?

    మరోవైపు.. నావల్నీకి మద్దతుగా రాజధాని మాస్కో సహా రష్యావ్యాప్తంగా లక్షలాది మంది నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కొన్నిచోట్ల ఆందోళనకారులు, భద్రతా బలగాలకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు వేలాది మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. నావల్నీకి శిక్ష విధించడంపై అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు