https://oktelugu.com/

మరో క్రేజీ మల్టీస్టారర్ కి రంగం సిద్ధం !

టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. ఎప్పుడూ లేనిది కొత్త కాంబినేషన్స్ తెర పైకి వస్తున్నాయి. తాజాగా మరో క్రేజీ కలయికలో ఓ మల్టీస్టారర్ మొదలుకానుంది. టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున – ఎనర్జిటిక్ స్టార్ రామ్ కలయికలో ఓ సినిమా రాబోతుంది. ఆ సినిమా పేరే ‘బంగార్రాజు’. నాగ్ ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలో కొత్తగా రామ్ కూడా చెరడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా, అక్కినేని […]

Written By:
  • admin
  • , Updated On : February 3, 2021 / 01:11 PM IST
    Follow us on


    టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. ఎప్పుడూ లేనిది కొత్త కాంబినేషన్స్ తెర పైకి వస్తున్నాయి. తాజాగా మరో క్రేజీ కలయికలో ఓ మల్టీస్టారర్ మొదలుకానుంది. టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున – ఎనర్జిటిక్ స్టార్ రామ్ కలయికలో ఓ సినిమా రాబోతుంది. ఆ సినిమా పేరే ‘బంగార్రాజు’. నాగ్ ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలో కొత్తగా రామ్ కూడా చెరడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా, అక్కినేని నాగార్జున సూపర్ హిట్ చిత్రాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా కీలకమైనది.

    Also Read: మహేష్ స్టేషన్స్ చుట్టూ తిరగలేక అలిసిపోయాడట !

    నాగార్జున కెరీర్ లో ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ మరో సినిమాకి రాలేదు, అన్నిటికి మించి నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన లభించింది, అలాగే ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోగా రామ్ నటించబోతున్నాడు. మొదట నాగచైతన్యను అనుకున్నా..మార్కెట్ పరంగా దృష్టిలో పెట్టుకుని రామ్ ను హీరోగా తీసుకున్నారు. ఇక మరో కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతుందని.. ఆమె నాగార్జున భార్య పాత్రలోనే కనిపించబోతుందనేది ఇప్పటికే తెలిసిన విషయమే. మరి రామ్ – నాగ్ కలయిక ఎలా ఉంటుందో చూడాలి.

    Also Read: ‘ఆచార్య’ ఆదాయం 200 కోట్లు !

    కాగా ప్రస్తుతం దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, ఈ చిత్ర సంగీత దర్శకుడు అనుప్ రూబెన్స్‌తో పాటు సాంగ్స్ కంపోజిషన్స్‌ లో బిజీగా ఉన్నాడు. ఆ మధ్య ఈ ఇద్దరు కలిసి గోవా ట్రిప్ కూడా వేశారట. ఇప్పటికే ట్యూన్స్ కూడా పూర్తయ్యాయట. నిజానికి ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ ఇప్పటికే రెండు సంవత్సరాల ఆలస్యం అయిపోయింది. దాంతో అనుకున్న సమయానికి బంగార్రాజు సినిమా సెట్స్ పైకి వెళ్ళలేకపోయింది. అయితే ‘బంగార్రాజు’ రాక ఆలస్యం అయినా, ఆసక్తి ఉండేలా ఉంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్