
Ration Card Holders: దేశంలోని ప్రజలలో ఎక్కువమంది రేషన్ కార్డును కలిగి ఉన్నారనే సంగతి తెలిసిందే. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లా రేషన్ కార్డ్ కూడా ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్ అని చెప్పవచ్చు. దేశంలో ఎవరైతే రేషన్ కార్డును కలిగి ఉంటారో వారికి తక్కువ ధరకే ప్రభుత్వం అందించే సబ్సిడీ సరుకులను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఉచితంగా రేషన్ అందిస్తున్న సంగతి తెలిసిందే.
రేషన్ కార్డును(Ration Card Holders) కలిగి ఉన్నవాళ్లు ప్రభుత్వాలు అందించే ఇతర బెనిఫిట్స్ ను కూడా పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే దేశంలో చాలామంది అనర్హులు సైతం రేషన్ కార్డును కలిగి ఉన్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అనర్హులకు పథకాలు అందకుండా చర్యలు చేపడుతూ ఉండటం గమనార్హం.
కొంతమంది ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నా రేషన్ కార్డులను కలిగి ఉన్నారు. అయితే కొత్త నిబంధనలను అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నట్టు బోగట్టా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొత్త నిబంధనలకు సంబంధించిన చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్రాల ప్రతిపాదనలు, సూచనలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చే ఛాన్స్ అయితే ఉంది.
ప్రస్తుతం అర్హత లేకపోయినా రేషన్ పొందుతున్న వారు కొత్త నిబంధనల అమలు తర్వాత రేషన్ పొందే ఛాన్స్ అయితే ఉండదని చెప్పాలి. కేంద్రం అర్హత ఉన్నవాళ్లకే రేషన్ సరుకులు అందజేయడం వల్ల పేద, మధ్య తరగతి వర్గాలకు చందిన ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది.