
కరోనా సమయంలో ప్రజలంతా కరోనా నిబంధనలను తు.చా. తప్పకుండా పాటిస్తున్నారు. ముఖానికి మాస్కు ధరించడం.. చేతులను శానిటైజర్లతో శుభ్రం చేసుకోవడం.. భౌతికదూరం పాటించడం వంటివి చేస్తూ ప్రతీఒక్కరూ కరోనా మహ్మమరి పట్ల అప్రమత్తంగా ఉంటున్నారు. ఇక మద్యప్రియులు సైతం తమ ‘మందు’జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నారు. దీంతో ఈసారి బీర్ల సేల్స్ భారీగా తగ్గినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి.
Also Read: బీజేపీ నేత రాసలీలల వీడియో: సంచలన నిజాలు
కరోనా సమయంలో మద్యంప్రియులు వీలైనంత వరకు బీర్లకు దూరంగా ఉంటున్నారు. బీర్లను సేవించడం వల్ల జలుబు, దగ్గు వంటివి వచ్చే అవకాశం ఉంది. చల్లటి పదార్థాలు తినడం.. సేవించడం వల్ల వైరస్ బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంది. దీంతో ఈ టైంలో బీర్ల కంటే మందు(హార్డ్)ను సేవించేందుకు మద్యంప్రియులు మొగ్గుచూపుతున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు వర్షాలతో వాతావరణం చల్లగా మారింది. ఈ నేపథ్యంలో మద్యంప్రియులు బీర్లు తాగితే జలుబు ఎక్కడ వస్తుందోనని వాటి జోలికి వెళ్లడం లేదు.
వీటితోపాటు ఇటీవల బీర్ల ధరలు విపరీతంగా పెరిగాయి. కిందటేడాది స్ట్రాంగ్ బీర్ రూ.120 బీరు ప్రస్తుతం 160కి చేరింది. రెండుబీర్లు కోనేచోట ప్రస్తుతం బ్రాండెడ్ కంపెనీ లిక్కర్ క్వాటర్ వస్తోంది. దీంతో మద్యంబాబులంతా హార్డ్ లిక్కర్ సేవించేందుకే మొగ్గుచూపుతున్నారు. గతేడాది ఆగస్టు.. సెప్టెంబర్ నెలలతో పొలిస్తే ఈసారి 20శాతం బీర్ల అమ్మకాలు తగ్గినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించిన గణాంకాలు తేటతెల్లం చేస్తున్నారు.
Also Read: మెట్రో చేతిలోకి ఆర్టీసీ బస్సులు.. ప్రయాణీకులకు వరంగా మారనుందా?
కరోనా ఎఫెక్ట్ తో బీర్ల అమ్మకాలు భారీగా పడిపోయినా ఆదాయం మాత్రం తగ్గడం లేదు. బీర్ల రేట్లు పెరగమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మద్యంబాబులు సోయితో కరోనా జాగ్రత్తలు పాటిస్తుండటం నిజంగా హర్షించదగిన విషయమే. ఏదిఏమైనా మద్యంప్రియుల ‘మందు’ జాగ్రత్త బేషుగ్గా ఉందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.