Akash Ambani : దేశంలో ఉద్యోగుల పని గంటలపై రెండు మూడు నెలలుగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇన్‌ఫోసిస్(Infosis) ఫౌండర్ నారాయణమూర్తి కొన్ని నెలల క్రితం చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడాలంటే దేశంలో యువత వారానికి 70 గంటలు పనిచేయాలని సూచించారు. ఆయన వ్యాఖ్యలను కొందరు సమర్థించగా, కొందరు వ్యతిరేకించారు. ఇటీవల ఇటీవల ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్‌ఎస్.సుబ్రహ్మణ్యన్(Subramanyan)మాట్లాడుతూ.. ఉద్యోగులు వారానికి 90గంటలు పనిచేయాలని పేర్కొన్నారు. ఇది తీవ్ర విమర్శలకు తావిచ్చింది. క్యాప్ జెమినీ ఇండియా సీఈవో అశ్విన్ మార్డి కూడా ఉద్యోగుల పనివేళలపై మాట్లాడారు. రోజుకు 9:30 గంటల చొప్పున ఐదు రోజులు పనిచేస్తే చాలని వెల్లడించారు. ఉద్యోగులకు వీకెండ్స్(week ends)లో ఈమెయిల్స్ పొంపొద్దని సూచించారు. తాను ఇదే సూత్రం నాలుగేళ్లుగా పాటిస్తున్నట్లు వెల్లడించారు. తాజాగా రిలయన్స్ జియో ఇన్‌ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ కూడా పనివేళలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read : బ్యాంక్ అకౌంట్స్ ఉన్న ఉద్యోగులకు హెచ్చరిక…!
నాణ్యత ముఖ్యమని..
ముంబైలోని టెక్ వీక్ ఈవెంట్‌లో ఆకాశం అంబానీ(Akssh Ambani) మాట్లాడుతూ ఒక ఉద్యోగి ఆఫీస్‌లో పనిచేసే గంటల సంఖ్యను చూడనని తెలిపారు. రోజువారీగా నాణ్యతే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. జీవితంలో పని, కుటుంబం తనకు అతిపెద్ద ప్రాధాన్యతలు అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ప్రాధాన్యాలను తెలుసుకుని పనిఏయాలని సూచించారు. తమ కంపెనీ వెయ్యి మంది డేటా సైంటిస్టులు, పరిశోధకులు, ఇంజినీర్ల బృందాన్ని ఏర్పాటు చేసుకుందని తెలిపారు. జామ్‌నగర్‌లో 1 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే గ్రాఫిక్, ప్రాసెసింగ్ యూనిట్లను సర్వీస్‌గా అందించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. త్వరలో క్లౌడ్ పర్సనల్ కంప్యూటర్ తీసుకొస్తామని వెల్లడించారు. రాబోయే త్రైమాసికాల్లో జియో బ్రెయిన్ పేరుతో ఏఐ సూట్ విష్కరిస్తామని పేర్కొన్నారు.
Also Read : తెగ కట్టేస్తున్నారు.. ఈ ఉద్యోగుల ఆదాయం రూ.500 కోట్లు.. ఈ పదేళ్లలో ఎంత పెరిగిందంటే?