Also Read: ఉద్యోగాలు కోల్పోయిన వారికి నిరుద్యోగ భృతి
కేంద్రం తాజాగా పార్లమెంట్ లో పెడుతున్న వ్యవసాయ బిల్లులు రైతులకు మరణశాసనం అంటూ ఇప్పటికే బీజేపీ మిత్రపక్షం శిరోమణి ఆకాలీదళ్ ప్రభుత్వం నుంచి వైదొలిగి షాకిచ్చింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ మిత్రపక్షం ‘శిరోమణి అకాలీదళ్’ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. అంతేకాదు.. బీజేపీలో కేంద్రమంత్రిగా ఉన్న శిరోమణి అకాలీదల్ ఎంపీ హర్ సిమ్రత్ కౌర్ తాజాగా కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే అన్ని పార్టీల నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది.
ఇప్పుడు అకాలీదళ్ దారిలోనే మరికొన్ని ఉత్తరాది పార్టీలు కూడా నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హర్యానాలోని బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యపక్షంగా ఉన్న ‘జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)’ ఎన్డీఏ నుంచి వైదొలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
90 స్థానాలున్న హర్యానాలో ఖట్టర్ సీఎంగా ఉన్నారు. బీజేపీ 40 స్థానాలు సాధించింది. జేజేపీ 10 స్థానాలు గెలిచింది. ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం పడిపోకుండా కింగ్ మేకర్గా ఉన్న చౌతాలా వైదొలిగితే హర్యానాలో సర్కార్ కుప్పకూలుతుంది. రైతుల పక్షపాతిగా ఉన్న చౌతాలా కుటుంబం రైతులకు అండగా ఉండేందుకు బీజేపీ వ్యవసాయ బిల్లును వ్యతిరేకించాలని.. ఈ క్రమంలోనే ప్రభుత్వం నుంచి వైదొలగాలని డిసైడ్ అయినట్టు సమాచారం.
Also Read: సినీ సెలబ్రెటీలకు వారి నుంచే డ్రగ్స్?
జేజేపీ చీఫ్ దుశ్యంత్ సింగ్ చౌతాలా ప్రస్తుతం హర్యానా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రభుత్వం నుంచి వైదొలిగితే బోటాబోటా మెజార్టీతో ఉన్న హర్యానా సర్కర్ కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ సర్కార్ రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని.. తాము ఇక ప్రభుత్వంలో కొనసాగలేమని అకాలీదళ్ నిర్ణయించిన నేపథ్యంలో హర్యానాలో చౌతాలా కూడా వైదొలుగుతున్నట్టు టాక్. ఇదే జరిగితే ఒక రాష్ట్రం బీజేపీ చేజారినట్టే..