Ahmedabad Plane Crash : నేడు అహ్మదాబాద్(Ahmedabad) లో జరిగిన విమాన ప్రమాదం(Flight Crash) లో 200 పైగా ప్రయాణికులు చనిపోయిన ఘటన యావత్తు భారత ప్రజానీకాన్ని శోకసంద్రంలోకి నెట్టేసిన సంగతి తెలిసిందే. గడిచిన రెండు దశాబ్దాలలో మన భారత దేశంలో ఇటువంటి ఘోరమైన ప్రమాదం ఎప్పుడు జరగలేదు. చనిపోయిన వారిలో ఎక్కువ శాతం విదేశాలకు చెందిన వారే ఉన్నారని అంచనా వేస్తున్నారు. AI 171 అనే ఈ విమానం టేక్ ఆఫ్ అవుతుండగా విమానాశ్రయం కి ఉన్న గోడని ఢీకొని కుప్పకూలిపోయినట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో చనిపోయిన ప్రతీ ఒక్క కుటుంబానికి కోటి రూపాయిల ఆర్ధిక సాయం అందిస్తామని టాటా గ్రూప్ సంస్థ కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేసింది. ఈ ఘటన పై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులందరూ తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. వాటిని చూస్తే ఎవరికైనా గుండె రగిలిపోవాల్సిందే. అంత దారుణంగా ఉన్నాయి.
మృతదేహాలను కేవలం DNA ద్వారా మాత్రమే కనిపెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే శరీరాలు ఆ స్థాయిలో కాలిపోయాయి. అయితే ఈ ఘటన నుండి సురక్షితంగా ఒకరు బయట పడడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. విమానం లో ఎమర్జెన్సీ డోర్ వద్ద కూర్చున్న విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి ప్రమాదం జరిగే కొద్దీ క్షణాల ముందే విమానం నుండి దూకి స్వల్ప గాయాలతో బయటపడి ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ ‘ విమానం టేక్ ఆఫ్ అయినా 30 సెకండ్స్ కి ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఆ తర్వాత విమానం కూలిపోయింది. కళ్ళు మూసుకొని తెరిచే లోపు ఈ ప్రమాదం జరిగింది’ అంటూ చెప్పుకొచ్చాడు. విశ్వాస్ కుమార్ గత కొంతకాలం నుండి UK లోనే నివసిస్తున్నాడు. చాలా కాలం తర్వాత ఇంటికి వచ్చిన ఆయన తన సోదరుడితో కలిసి UK కి బయలుదేరాడు. ఇంతలోపే ఈ దారుణ సంఘటన జరిగింది. విమానం నుండి దూకిన తారట రమేష్ ఎలా నడుచుకుంటూ వెళ్తున్నాడో మీరే ఈ క్రింది వీడియో లో చూడండి.
Ramesh, survived the #AirIndiaCrash…. What a lucky man…
He was sitting at the emergency door, jumped as soon as the plane crashed.Miracle do happens… Feeling so good for his family… At least one family is happy today… pic.twitter.com/5OptaO1iue
— Mr Sinha (@MrSinha_) June 12, 2025