Homeజాతీయ వార్తలుAhmedabad Flight Crash: అహ్మదాబాద్ దుర్ఘటనలో.. ఈ ప్రశ్నలకు బదులేదీ?

Ahmedabad Flight Crash: అహ్మదాబాద్ దుర్ఘటనలో.. ఈ ప్రశ్నలకు బదులేదీ?

Ahmedabad Flight Crash: అలాంటిది ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్తున్నప్పుడు.. అది కూడా అంతర్జాతీయ విమానం ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి? కానీ ఇవేవీ పాటించలేదా? విమానాన్ని పరిశీలించలేదా? నిర్లక్ష్యంగా వదిలేశారా? ప్రయాణికుడు తాను పరిశీలించిన లోపాలను ట్విట్టర్ వేదికగా విమానయాన సంస్థకు తెలియజేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలను నిపుణులు లేవ నెత్తుతున్నారు. జరిగిన దారుణంపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. టేక్ ఆఫ్ ఆయన విమానం వెంటనే కూలిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. గతంలో పైలట్ పనిచేసిన అనుభవం ఎహసాన్ ఖలీద్ అనే వ్యక్తికి ఉంది. ఈ ప్రమాదాన్నిపద్యంలో ఆయన స్పందించారు. విమానానికి ల్యాండింగ్ గేర్ కిందికి ఎలా ఉంటుందని ఆయన విస్మయ వ్యక్తం చేశారు. ఆ గేర్ కిందికి ఉండడం పట్ల అనుమానం వ్యక్తం చేశారు. విమానం నడుపుతున్న పైలట్ ఏటీసీకి “మేడే కాల్” ఇచ్చారంటే అందులో వ్యవస్థ విఫలమైనట్టేనని పేర్కొన్నారు.. అసలు ల్యాండింగ్ గేర్ కిందకు ఉండడమే అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. “విమానం గాల్లో ఎగిరిన వెంటనే ల్యాండింగ్ గేర్ దానంతట అదే లోపలికి వెళ్ళిపోతుంది. కూలిన విమానానికి సంబంధించిన ల్యాండింగ్ గేర్ కిందకు ఉంది. ఈ ప్రకారం ఇంజన్ విఫలం చెందినట్టే భావించాలని” ఖలీద్ చెప్తున్నారు. ” లోహ విహంగం శక్తిని కోల్పోయింది. దానికి ఇంజన్లో తలెత్తిన లోపం కూడా కారణం కావచ్చు. సాధారణంగా విమానానికి సంబంధించి రెండు ఇంజన్లు ఒకేసారి వైఫల్యం చెందే అవకాశాలు ఉండదు. ఒకవేళ అంతటి స్వల్పకాలంలో ఏదైనా పక్షి ఢీకొంటే కూడా ఇంజన్లు విఫలమయ్యే అవకాశం లేదని” ఎహసాన్ ఖలీద్ పేర్కొన్నారు.

Also Read: దేశంలో అతిపెద్ద విమాన ప్రమాదాలు ఇవే..

అసహజంగా ల్యాండింగ్ గేర్

అమెరికాలో ఏరో స్పేస్ సేఫ్టీ కన్సల్టెంట్ గా పనిచేస్తున్న ఆంటోనీ బ్రిక్ హౌస్ కూడా ఖలీద్ మాదిరిగానే అనుమానాలను వ్యక్తం చేశారు. టేక్ ఆఫ్ అయిన విమానానికి ల్యాండింగ్ గేర్ అసహజంగా ఉండడం ఈ ప్రమాదానికి కారణమని ఆయన భావించారు. విమానం ఉన్నట్టుండి ఒకేసారి కూలిపోతున్నప్పుడు.. ఆ దృశ్యాలను చూస్తే రన్వే వైపు ప్రయాణిస్తున్నట్టుగా కనిపించిందని ఆయన పేర్కొన్నారు.. ” అంతమంది ఉన్న విమానం ప్రయాణించడానికి పూర్తి సంసిద్ధతతో ఉందా? విమానాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేశారా? విమానానికి కీలకమైన రెక్కల స్లాట్, ఫ్లాప్ లు సరైన మార్గంలోనే ఉన్నాయా? అవి విమానం ఎగరడానికి సహకరిస్తున్నాయా? విమానం కూలిపోయిన తర్వాత కనిపిస్తున్న దృశ్యాలను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. విమానాలను నడిపే క్రమంలో ల్యాండింగ్, టేక్ ఆఫ్ అనేవి అత్యంత జాగ్రత్తగా చేపట్టాల్సిన దశలు.. గాల్లో ఎగిరిన అభిమానాలు 200 నుంచి 650 అడుగులకు పైగా ఎత్తుకు చేరుకోలేనప్పుడు పైలెట్లు కచ్చితంగా టేక్ ఆఫ్ ఆపేస్తారు. అలాంటప్పుడు చివరి దశలో ఉండగానే ఈ సమస్య ఉత్పన్నమై ఉంటుందని”అమెరికా ఏవియేషన్ సేఫ్టీ కన్సల్టెంట్ జాన్ ఎం కాక్స్ ప్రకటించారు.

పక్షి ఏమైనా ఢీ కొట్టిందా

విమానానికి సంబంధించిన రెండు ఇంజిన్ లు విఫలం కావడం లేదా పక్షి ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని నిపుణులు అంచనాబిస్తున్నారు.. విమానం కూలిపోతున్నప్పుడు.. ఆ దృశ్యాలను చూస్తుంటే ఇంజన్లు శక్తిని అందించడంలో విఫలమైనట్టు తెలుస్తోంది. ఇదే అభిప్రాయాన్ని విమానయాన శాఖలో వైట్ బాడీ పైలెట్లుగా పనిచేస్తున్న వ్యక్తులు వ్యక్తం చేశారు. ఒక ఇంజన్ గనుక విఫలమైతే విమానం ఊగిపోతుంది.. కానీ అక్కడ అలాంటి పరిస్థితి లేదు. పైగా అభిమానం స్థిరంగానే ఉంది. ఈ ప్రకారం చూసుకుంటే రెండు ఇంజన్లు విఫలమైనట్టే అనుకోవాలి. రెండు ఇంజన్లలో త్రస్ట్ లేదని ఓ కమాండర్ వెల్లడించారు. అనుకోకుండా పక్షులు ఢీకొంటే వెంటనే ఇంజన్లలో మంటలు ఏర్పడి ఉండవచ్చని.. అందువల్లే విమానం తన రెండు శక్తిని కోల్పోయి ఉంటుందని సీనియర్ పైలెట్లు చెబుతున్నారు.. ఒక ఇంజన్ విఫలం కావడం వల్ల.. లాండింగ్ గేర్ పైకి రాకపోవడం వల్ల.. రెండవ ఇంజన్ కూడా పూర్తిస్థాయిలో శక్తిని ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని..ఆ సీనియర్ పైలెట్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular