బీజేపీ అగ్రనేతల్లో ‘అగ్రి’ టెన్షన్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకతను తీసుకొస్తున్నాయి. ఆ ప్రభావం ఇపుడు పార్టీపై స్పష్టంగా చూపుతోంది. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కొన్ని నెలలుగా రైతులు ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు సైతం కొనసాగించింది. కానీ.. పెద్దగా పాజిటివ్‌ ఫలాలైతే కనిపించలేదు. Also Read: బాబు.. ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా..? దీంతో ఇప్పుడు ఈ ప్రభావం కాస్త పశ్చిమబెంగాల్‌ […]

Written By: Srinivas, Updated On : March 15, 2021 11:25 am
Follow us on


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకతను తీసుకొస్తున్నాయి. ఆ ప్రభావం ఇపుడు పార్టీపై స్పష్టంగా చూపుతోంది. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కొన్ని నెలలుగా రైతులు ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు సైతం కొనసాగించింది. కానీ.. పెద్దగా పాజిటివ్‌ ఫలాలైతే కనిపించలేదు.

Also Read: బాబు.. ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా..?

దీంతో ఇప్పుడు ఈ ప్రభావం కాస్త పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో కనిపిస్తోంది. పశ్చిమబెంగాల్‌లో జరుగుతున్న ఎన్నికల్లో రైతుసంఘాలు కమలం పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టాయి. ఏ పార్టీకైనా ఓట్లేయండి కానీ బీజేపీకి మాత్రం వేయొద్దంటు రైతుఉద్యమ సంఘం ఆధ్వర్యంలోని సంయుక్త కిసాన్ మోర్చా కీలక నేత యోగేంద్ర యాదవ్ ప్రచారం ప్రారంభించారు. యోగేంద్ర ఆధ్వర్యంలో బెంగాల్‌లోని రైతుసంఘాలు బీజేపీ వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున మొదలుపెట్టాయి. బెంగాల్ ఎన్నికల్లో కమలంపార్టీ ఓడిపోతే కానీ నూతన వ్యవసాయ చట్టాల రద్దుపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించదని యోగేంద్ర స్పష్టంగా చెబుతున్నారు. కిసాన్ మహా పంచాయత్ పేరుతో రైతుసంఘాల నేతలు రాకేష్ సింగ్ తికాయత్, యధువీర్ సింగ్ బీజేపీ వ్యతిరేక ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనున్నారు.

వ్యతిరేక ప్రచారంలో భాగంగా ఈ ముఖ్య నేతలంతా ముఖ్యంగా భవానీపూర్, నందిగ్రామ్, సింగూర్, అసన్ సోల్‌లో భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. ఒకవైపు మమతా బెనర్జీ నరేంద్రమోడీ, అమిత్ షా తదితరులపై విరుచుకుపడుతుంటే మరోవైపు రైతుసంఘాల నేతలు కూడా బీజేపీ వ్యతిరేక ప్రచారంలో భాగస్వాములు కానున్నారు. దాంతో బీజేపీ నేతలకు ఇబ్బందులు మొదలవ్వటం ఖాయమనే అభిప్రాయం వెల్లడవుతోంది.

Also Read: ఫిరాయింపుదారులందరికీ టికెట్లు దక్కేనా..?

ఎందుకంటే రాకేష్ తికాయత్ బలమైన రైతు నేత. ఈయన ప్రభావం ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్ధాన్, బెంగాల్, మహారాష్ట్రలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో దళిత్ పంచాయత్ కూడా కేంద్రప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని డిసైడ్ చేసింది. తికాయత్ పిలుపునకు సానుకూలంగా స్పందిస్తున్నట్లు దళిత్ పంచాయత్ నేతలు స్పష్టంగా చెబుతున్నారు. కాబట్టి బెంగాల్‌లో ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ అగ్రనేతలకు టెన్షన్ పెరిగిపోతోంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్