https://oktelugu.com/

AP-Telangana: ఏపీతో ఒప్పందాలు.. తెలంగాణలో పెట్టుబడులు..

AP-Telangana: సొమ్మొకడిది సోకొకడిది అనే సామెత తెలిసే ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఏపీలో అమూల్ సంస్థకు అక్కడి ప్రభుత్వం నిధులు సమకూర్చేందుకు బాటలు వేసింది. సంస్థ లాభాల బాటలో పయనించేందుకు కావాల్సిన అన్ని తివాచీలు పరిచింది. దీంతో రూ. వేల కోట్ల ఆస్తులు సంస్థకు చేకూరాయి. కానీ ఆ సంస్థ పెట్టుబడులు మాత్రం తెలంగాణల పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఏపీలో నిధులు సమకూర్చుకుని తెలంగాణలో పరిశ్రమ నెలకొల్పేందుకు సిద్ధం కావడం గమనార్హం. […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 30, 2021 / 10:37 AM IST
    Follow us on

    AP-Telangana: సొమ్మొకడిది సోకొకడిది అనే సామెత తెలిసే ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఏపీలో అమూల్ సంస్థకు అక్కడి ప్రభుత్వం నిధులు సమకూర్చేందుకు బాటలు వేసింది. సంస్థ లాభాల బాటలో పయనించేందుకు కావాల్సిన అన్ని తివాచీలు పరిచింది. దీంతో రూ. వేల కోట్ల ఆస్తులు సంస్థకు చేకూరాయి. కానీ ఆ సంస్థ పెట్టుబడులు మాత్రం తెలంగాణల పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఏపీలో నిధులు సమకూర్చుకుని తెలంగాణలో పరిశ్రమ నెలకొల్పేందుకు సిద్ధం కావడం గమనార్హం.

    అమూల్ సంస్థ తెలంగాణలో రూ. 500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు మంత్రి కేటీఆర్ తో సమావేశం అయింది. కంపెనీ భవిష్యత్ ప్రణాళికలకు సహకారం అందించేందుకు సంస్థ అంగీకరించింది. దీంతో దక్షిణ భారతదేశంలోనే తొలి డెయిరీ ప్లాంట్ ఏర్పాటుకు కూడా సమ్మతి తెలిపింది. తెలంగాణలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో రెండు దశల్లో ఐదు వందల కోట్ల పెట్టుబడితో అమూల్ సంస్థ ముందుకు రావడం సంతోషదాయకమే.

    Also Read: టీవీ9 నుంచి బిగ్ వికెట్ ఔట్.. అసలు కారణం ఇదే!
    భవిష్యత్ లో కూడా తెలంగాణలోనే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా బట్టర్ మిల్క్, పెరుగు, లస్సీ, పన్నీర్, స్వీట్లు వంటి ఉత్పత్తులను ఇక్కడ ఉత్పత్తి చేసేందుకు ఆమోదం తెలిపింది. దీంతో తెలంగాణలో అమూల్ వ్యాపారం మూడు పవ్వులు ఆరు కాయలుగా మారనుంది. తెలంగాణలో బిస్కట్, బ్రెడ్, బేకరీ ఉత్పత్తులు కూడా చేసేందుకు ఒప్పందం చేసుకుంది.

    రాబోయే రోజుల్లో తెలంగాణలో అమూల్ వ్యాపారం మరింత విస్తృతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రచిస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే 18 నుంచి 24 నెలల్లో అమూల్ సంస్థ తన పనులు ప్రారంభిస్తుంది. ఏపీ ప్రభుత్వం నుంచి ఆదాయం వస్తున్నా వ్యాపారం మాత్రం తెలంగాణలో చేయడంతో సొమ్మొకడిది సోకొకడిది అనే సామెతకు చక్కగా సరిపోతుందని తెలుస్తోంది.

    Also Read: ఆస్తులు పోయి.. అప్పులు మిగిలాయి.. ఏపీలో అభివృద్ధి ఎందుకు ఆగిందో తెలుసా?

    Tags